సాదారణంగా ఏదైనా ఆస్ట్రాయిడ్ భూమివైపుకు దూసుకువస్తే… భూగోళం నాశనమై పోతుందనీ, సమస్త జీవకోటి అంతరించిపోతుందనీ భయపడుతుంటారు. అందుకే, నాసాతో సహా వరల్డ్ వైడ్ గా ఉన్న స్పేస్ సెంటర్స్ అన్నీ అలర్ట్ అయి… వీటిపై స్పెషల్ ఫోకస్ చేస్తుంటాయి. ఇక సైంటిస్టులు అయితే ఎప్పటికప్పుడు ఆస్టరాయిడ్‌లను భూమి వైపుకి రాకుండా దారిమళ్లించడమో… కెమికల్ రియాక్షన్ ద్వారా వాటిని అంతరిక్షంలోనే పేల్చేయడమో వంటివి చేస్తుంటారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం దీనికి పూర్తి విరుద్దం. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీ కొడుతుందని కాదు. అందులో బోలెడన్ని ఖనిజాలు ఉన్నాయని తేలింది. ఈ ఆస్ట్రాయిడ్ భూమ్మీదకు వస్తే… భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా కుబేరులై పోతారట.
విశ్వం పుట్టుక, గ్రహాలపై మనుగడ గురించి ఎప్పుడూ రీసర్చ్ చేసే నాసా ఇప్పుడు తాజాగా ఓ ఆస్ట్రాయిడ్ గురించి రీసర్చ్ చేస్తుంది. ‘16సైకీ’ అనే పేరున్న ఈ ఆస్ట్రాయిడ్ అంగారక గ్రహం, గురు గ్రహం మధ్యలోఉంది. ఇది భూమికి 23 కోట్ల కిలోమీటర్ల దూరంలో… 140 మైళ్ల వ్యాసంతో… ఉంది. ఇంతకాలం నాసా గ్రహాలపై ఉండే నీళ్లు, రాళ్లు గురించి మాత్రమే ఎక్స్ ప్లోర్ చేసేది. ఇప్పుడు మాత్రం కొత్తగా లోహాల గురించి పరిశోదించటం మొదలుపెట్టింది. ఈ పరిశోదనల్లో తేలింది ఏంటంటే, 16 సైకీ అనే ఆస్ట్రాయిడ్‌లో మెటల్స్ ఎక్కువగా ఉన్నాయని.
ఈ ఆస్ట్రాయిడ్‌లో ఉన్న మెటల్స్ విలువ ఎంతో తెలుసా..! 10,000 క్వాడ్రిలియన్ డాలర్లు. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ భూమ్మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి పంచితే కనీసం 7000 కోట్ల రూపాయలు వస్తాయి. అంతేకాక, ఇంకా ఈ భూమిపై వివిధ పనులకి అవసరమయ్యే లోహాలని కొన్ని లక్షల ఏళ్లపాటు వాడుకొంటానికి వీలుగా ఉన్నన్ని లోహాలు 16 సైకీలో ఉన్నాయట. ఇంకా ఈ ఆస్ట్రాయిడ్ మీద నికెల్, ఉక్కు నిల్వలు 17 మిలియన్ బిలియన్ టన్నులుగా ఉండొచ్చని కూడా అంచనా.