What Happens if a Crow Appears in a Dream

కలలో కాకి కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..!

నిద్రిస్తున్న సమయంలో కలలు రావటం అనేది చాలా సాదారణ విషయమే! రాత్రిపూట వచ్చే కలలకి, తెల్లవారుజామున వచ్చే కలలకి చాలా వ్యత్యాసం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ఎలాగంటే, తెల్లవారుజామున వచ్చే కలలు దాదాపుగా నిజమవుతాయని నమ్ముతారు. అయితే, ఈ కలల్లో కొందరికి దేవుళ్ళ కలలు వస్తే, ఇంకొందరికి దెయ్యాల కలలు మరికొందరికి నదులు, సముద్రాలు, అడవులు, జంతువులు, పక్షులకి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఏదేమైనా కానీ, మొత్తం మీద ఆ కలల ప్రభావం మన జీవితంపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అయితే, కలలో కాకి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

  • ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కలలో కాకి కనిపించి… అది తూర్పు నుండి పడమరకు ఎగురుతున్నట్లుగా కనిపిస్తే… అతను త్వరలోనే సంపదను పొందుతాడని అర్ధం.
  • అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కలలో కాకి పెరుగు తింటున్నట్లుగా కనిపిస్తే… అతని ఆరోగ్యం త్వరలోనే కుదుటపడుతుంది అని నమ్మకం.
  • ఏదైనా పోటీ పరీక్షకి సిద్ధమవుతున్న విద్యార్థికి కలలో కాకి కనిపించి… పెరుగు, వెన్న తింటున్నట్లుగా ఉంటే… ఆ పరీక్షలో విజయం సాధిస్తారు.
  • పెళ్లికాని యువతీ యువకుల కలలో కాకి వారి ఇంటి వెనుక కూర్చొని ఉన్నట్లుగా కనిపించినట్లయితే… త్వరలోనే వారికి పెళ్లి జరుగుతుంది.
  • వివాహం అయిన వ్యక్తుల కలలో  కాకి కనిపించి…  పాలు తాగుతున్నట్లయితే.. వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. అదే, వివాహం కాని వ్యక్తులకి అలా కనిపిస్తే… త్వరలోనే వివాహం నిశ్చయమవుతుంది.
  • వలలో చిక్కుకున్న కాకి… ఎలాగోలా ఆ ఉచ్చు నుండి బయటపడి ఎగిరిపోయినట్లు కనిపిస్తే… శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం.
  • నిరుద్యోగి కలలో కాకి పెరుగు తింటూ కనిపిస్తే… త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది.
  • వ్యాపార స్థలంలో కాకి కూర్చున్నట్లుగా కనిపిస్తే… వారు వ్యాపారంలో విజయం సాధిస్తారు.
  • ఎగురుతున్న కాకుల గుంపులోంచి ఓ కాకి తిరిగి వచ్చి మనం  పెట్టిన పండుని తిన్నట్లుగా కనిపిస్తే…  వారికి సంపద లభించడం కానీ,  సంతాన భాగ్యం కలగడం కానీ జరుగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top