Cockatiel Calls her Children Peekaboo

ఈ కాకటెయిల్ చూడండి అప్పుడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! (వీడియో)

రోజూ మనం సోషల్‌ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. అందులో ముఖ్యంగా యానిమల్స్ కి, బర్డ్స్ కి సంబంధించిన వీడియోలే ఎక్కువ వైరల్‌ అవుతుంటాయి. ఒక్కోసారి అవి చేసే పనులు చాలా ఫన్నీ గా అనిపిస్తే… ఒక్కోసారి మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటి వీడియోలలో ఇది కూడా ఒకటి. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. 

సాదారణంగా మనం అప్పుడే పుట్టిన న్యూ బర్న్ బేబీలని ఏమని పిలుస్తాం..? చిన్నీ! చిట్టీ! బుజ్జీ! అంటూ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం అవునా! ఈ పక్షి కూడా తన పిల్లలని ముద్దుపేరుతో పిలుస్తూ ఆడిస్తుంది. ఈ సంఘటన టర్కీలోని బుర్సాలో జరిగింది. 

రామచిలుక జాతికి చెందిన ఓ కాక్ టయిల్  అప్పుడే పుట్టిన తన బేబీస్ ని చూసి తెగ మురిసిపోయింది. ముద్దు ముద్దుగా వాటిని పలకరిస్తోంది. అది కూడా అచ్చం మనిషిలాగే! 

ఆస్ట్రేలియా దేశానికి చెందిన కాక్ టయిల్స్ సాదారణంగా మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇవి మనుషులను చక్కగా అనుకరిస్తాయి కూడా. మనం ఏదైనా ట్రైనింగ్ ఇస్తే చాలా ఈజీగా నేర్చేసుకుంటాయి. అందుకే దీనిని మోస్ట్ ఇంటలిజెంట్ బర్డ్ గా చెబుతారు. 

ఈ వీడియోలో మనం చూస్తున్న కాక్ టయిల్ కి ఇష్టమైన ఆట ‘పికాబు’ అట. అందుకే అది ఆ పేరుతోనే తన పిల్లలని పలకరిస్తోంది. పైగా వాటిని ఒక పింగాణి పాత్రలో కూర్చోబెట్టి ఆడిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కాక్ టయిల్ కి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోని ‘నెస్టేక్‌ కనట్లర్‌’ అనే యానిమల్ లవర్ తన సోషల్‌ మీడియా ఎకౌంట్ లో పోస్ట్‌ చేశాడు. మీరుకూడా దీనిపై ఓ లుక్కేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top