ఐపీఎల్ 2021 తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో… కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయన సంగతి తెలిసిందే! అయితే, విరాట్ కోహ్లీకి ఇది తన కెప్టెన్సీలో ఆడుతున్న చివరి ఐపీఎల్ కావడం విశేషం. అందుకే, ఎలాగైనా ఈసారి ఆర్‌సీబీకి ట్రోఫీ అందించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాడు.
అయితే, ఊహించనివిధంగా ఓటమిపాలవ్వడంతో… విరాట్ కల నెరవేరకుండా పోయింది. చివరికి ఓటమిభారంతో, టోర్నమెంట్ నుంచి ఆర్‌సీబీ తప్పుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగా మైదానంలో విరాట్ కోహ్లీ కంటతడి పెట్టాడు. మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తన జట్టుతో మాట్లాడుతున్నప్పుడు కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అందుకున్న ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు తీసింది. తర్వాత కేకేఆర్ 139 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయినప్పటికీ చివరి ఓవర్‌లో సాధించింది. దీంతో కోహ్లీ ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అయితే, గతంలో విరాట్ కోహ్లీ తన తండ్రి మరణించిన సమయంలో కూడా అస్సలు ఏడవలేదు. మరుసటి రోజునే బ్యాటింగ్ చేయడానికి వెళ్లాడు. అంతలా క్రికెట్ ని ప్రేమించే కోహ్లీ… 2016 ఐపీఎల్ ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు ఒకసారి, 2021 ఐపీఎల్ ఓడిపోయినప్పుడు ఇప్పుడు మరోసారి భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఈ సారి మాత్రం కెప్టెన్‌గా తన చివరి ఐపీఎల్ కావడంతో మరింత ఎమోషన్ అయ్యాడు. ఇక కోహ్లీతో పాటు, డివిలియర్స్ కూడా ఏడుస్తూ ఈ వీడియోలో కనిపించాడు.
first time kohli is crying.Last match as RCB Captain. @imVkohli @BCCI @ICC @IPL
#Kohli#crying#last#match#captain#rcb pic.twitter.com/kZDWQgwKRT— Shubham Yadav( Dainik Bhaskar) (@shubham00211591) October 11, 2021