అడవి అంటేనే క్రూరమృగాలకి నిలయం. అలాంటి అడవిలో టైగర్ కాస్త డిఫరెంట్. అడవిలో అన్నిటికంటే దీని ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. ఇక కొద్ది దూరంలో పులి కనిపించిందంటే చాలు… మిగిలిన జంతువులన్నీ ఎలర్ట్ అవుతాయి.
ఒక్క పులి కనిపిస్తేనే చిన్న జంతువులు బతుకు జీవుడా! అంటూ పారిపోతాయే…అలాంటిది పులుల మందే కనిపిస్తే ఇంకేమైనా ఉందా! అసలా జంతువు బతికి బట్టకడుతుందా..! కానీ దీనికి భిన్నంగా జరిగింది ఈ వీడియోలో.
ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటివాటిలో ఇది కూడా ఒకటి. ఏకంగా 5 పులుల మద్య చిక్కుకున్నప్పటికీ… వాటితో సరదాగా ఆటలాడుకుంటుంది ఓ కుక్క. ఆ తర్వాత ఏమైందో మీరు ఊహించే ఉంటారు. కానీ, మీరు ఊహించినదానికంటే భిన్నంగా జరిగింది ఇక్కడ.
ఈ వీడియోలో ఐదు పులుల మధ్య ఓ కుక్క ఉంటుంది. అది పొరపాటున చిక్కుకుందో… లేదంటే మొదటినుండీ ఆ పులులతో కలిసి పెరిగిందో… తెలియదు కానీ, హాయిగా సేద తీరుతూ వాటితో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. ఆ పులులు కూడా దాన్ని ఎంతో ప్రేమతో సాకుతున్నాయి.
సామాన్య మనుషులే పశువులకంటే నీచంగా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో… క్రూరమృగాలు అయి ఉండీ కూడా ఒక సాదు జంతువుని తన సొంత బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి. ఇది కదా వింత అంటే!
View this post on Instagram