‘బాల వాక్కు… బ్రహ్మ వాక్కు అంటారు’ పెద్దలు. అందుకేనేమో కొంతమంది చిన్నారులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అచ్చం భవిషత్తు తెలిసిన వారిలా మాట్లాడుతుంటారు. తెలిసీ తెలియని వయసులో… అమాయకత్వంతో కూడిన వారి మాట తీరు ఎంతో ఆలోచింప చేసేదిగా ఉంటుంది.
సరిగ్గా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటు చేసుకుంది. దసరా ఉత్సవాలు పూర్తవ్వడంతో… పట్టణంలో దుర్గామాత నిమజ్జనం జరుగుతుంది. దుర్గామాత ఊరేగింపు సందర్భంగా రికార్డింగ్ సాంగ్స్ ప్లే చేశారు. అందులోభాగంగా డీజే సౌండ్ పెట్టారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు… సౌండ్ పెట్టవద్దని నిర్వాహకులని సూచించారు. ఇంతలో అక్కడే ఉన్న ఓ బుడ్డోడు డీజే సౌండ్ ఎందుకు పెట్టొద్దు సార్? మా దుర్గమ్మ ఊరేగింపుకి డీజే ఎందుకు పెట్టోద్దు సార్? అంటూ ఎస్సైని నిలదీశాడు. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం సార్… ఇప్పుడైతే డీజే పెడుతాం సార్… అని చెప్పి పోలీసులకే చుక్కలు చూపించాడు. ఇంతకీ ఆ బుడ్డొడి వయసెంతో తెలుసా… 6 ఏళ్లు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.