పాప్ స్టార్ మైకెల్ జాక్సన్ మనకి పరిచయం అక్కర్లేని వ్యక్తి. సంగీత ప్రపంచంలో తిరుగులేని రారాజుగా యావత్ ప్రపంచాన్నీ తనవైపుకి తిప్పుకున్న వ్యక్తి ఇతను. జీవితం తనకి చేదు అనుభవాలనే మిగిల్చినా… ప్రజల గుండెల్లో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నాడు.
ఇప్పటివరకూ మైకెల్ జాక్సన్ ని అనుకరించే డ్యాన్సర్లు ఎంతోమంది వచ్చినా… ఆయన్ని మరిపించే డ్యాన్సర్ మాత్రం రాలేదనే చెప్పుకోవాలి. ఇక మైకెల్ జాక్సన్ సిగ్నేచర్ స్టెప్ మూన్‌వాక్ అని తెలిసిందే! అయితే, ఆ స్టెప్ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. బాడీలోని ప్రతి పార్ట్ మన కంట్రోల్ లో ఉంచుకొని డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ స్టెప్ ఒక్క మైకెల్ జాక్సన్ కి తప్ప మరెవ్వరికీ సాధ్యపడదు.
అలాంటి మూన్‌వాక్ స్టెప్ ని ఒక బాతు ఎంత సింపుల్ గా చేసిందో చూస్తే… ఎవ్వరైనా మైకెల్ జాక్సన్ మళ్ళీ పుట్టాడనిపిస్తుంది. అంత అద్భుతంగా చేసిందా బాతు. ఆ బాతు అంతలా మైకెల్ స్టెప్స్ అదరగొడుతుంటే… పక్కనే ఉన్న మిగిలిన బాతులు ఆశ్చర్యంగా చూస్తున్నాయి.
ఈ వీడియోని కల్నల్ DPK పిళ్లే అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “పునర్జన్మపై నమ్మకం లేని వారి కోసం ఈ వీడియో. ఇదిగో మైఖేల్ జాక్సన్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.
For those who dont belive in reincarnation.
Here is Michael Jackson pic.twitter.com/Fi7un9hUwx— Col DPK Pillay,Shaurya Chakra,PhD (Retd) (@dpkpillay12) October 21, 2021