పాములన్నిటిలోనూ నాగాపాము అత్యంత ప్రమాదకరమైన పాము. పొరపాటుగా దీనిని ఎవరైనా రెచ్చగొడితే… బుసలు కొడుతుంది. ఇక ఆ సౌండ్ కే అక్కడున్నవారు గుండె ఆగి చస్తారు.
సాదారణంగా పాములనేవి ఏ చెట్లలోనో, పొదల్లోనో, గుట్టల్లోనో ఉంటూ ఉంటాయి. మనుషుల మధ్యకి రానే రావు. ఎందుకంటే, ఎక్కడ చంపేస్తారోనన్న భయం. అలాంటిది ఒక నాగాపాము నేరుగా ఒక ఇంతలోకే వచ్చేసింది. వచ్చి… ఇంటి గుమ్మానికి ఉన్న తలుపు సందుల్లో తిష్ట వేసింది. దాన్ని వెళ్ళగొట్టబోతే… బుసలు కొడుతుంది.
వివరాల్లోకి వస్తే… నేపాల్లోని ఘోరాహీ అనే పట్టణంలో ఉన్న ఒక ఇంట్లోకి కోబ్రా వచ్చింది. ఎలా వచ్చిందో… ఎక్కడనుండీ వచ్చిందో… తెలియదుకానీ, వారింట్లో ప్రవేశించి… మెయిన్ డోర్ సందుల్లో కూర్చుంది. ఇది గమనించిన ఆ ఇంట్లోని సభ్యులు దాన్ని తరమబోతే… పడగ విప్పింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు వీడియో తీయడం ప్రారంభించారు. నన్నే వీడియో తీస్తారా..! అంటూ… వారిపై బుసలు కొట్టటం మొదలుపెట్టింది. అయినప్పటికీ వాళ్ళు ఏ మాత్రం భయపడకుండా వీడియో కంటిన్యూ చేస్తూ వచ్చారు. మరి ఈ పాము చేసే హిస్… సౌండ్ ఎంత భయంకరంగా ఉందో మీరూ వినండి.