మోనోలిత్ అంటే - ఏకశిలా విగ్రహం అని అర్ధం. ఈ నిగూఢమైన నిర్మాణాల వెనుక ఆసక్తికరమైన గొప్ప విషయమే దాగి ఉంది.
కొన్నాళ్ళ క్రితం ఎక్కడ చూసినా ఇదే వార్త. రోజుకో చోట ప్రత్యక్షమవుతున్న ఈ లోహ స్తంభం… కొద్ది రోజుల తర్వాత అదృశ్యమవుతుంది.
ఇది మేథావులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా! లేదా గ్రహాంతర వాసులు చేస్తున్నారా! ఇంతకీ ఇది దేనికి సంకేతం అనేది అర్థం కాక అందరూ జుట్టు పీక్కుంటున్నారు.
తొలుత అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో ఏదో ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది. దాని దగ్గరికి వెళ్లి పరిశీలించగా… ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ఒక ఎత్తైన స్తంభం కనిపించింది.
కొద్ది రోజుల తర్వాత ఇలాంటి లోహపు స్తంభమే కాలిఫోర్నియా, రోమానియాలో ప్రత్యక్షమయింది. అనంతరం ఒకేసారి రెండు దేశాల్లో ఈ మోనోలిత్లు ప్రత్యక్షమయ్యాయి.
విచిత్రంగా ఇది ఎక్కువ లోతులో పాతిపెట్టలేదు. అదీకాక, ఆ మొనోలిత్ చెక్కతో తయారుచేయబడి ఉంది. దానికి మూడు వైపులా అద్దాలు అమర్చబడి ఉంది.
మోనోలిత్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఆసక్తిని రేపాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఈ రహస్య నిర్మాణాల గురించి చిత్రాలు మరియు చర్చలతో మునిగిపోయాయి,
ఈ నిర్మాణాల వెనుక మూలం మరియు ఉద్దేశ్యాన్ని పరిశోధించడానికి పరిశోధకులు నిపుణుల బృందాలను పంపారు. ఆ ఇన్వెస్టిగేషన్స్ కీలకమైన ఆధారాలను అందించాయి.
మొనోలిత్ లు ఏవైనా నాగరికతకు సంబంధించిన కమ్యూనికేషన్స్ కావచ్చని తేలాయి. అయితే వీటి యొక్క నిజమైన క్రియేటర్స్ మాత్రం ఎవరో తేలలేదు.
ఏదేమైనా మొనోలిత్ ప్రత్యక్షం మరియు తరువాత అదృశ్యం వరకు ఈ దృగ్విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉర్రూతలూగించింది.