ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఎవరో వస్తారు… ఏదో చేస్తారు అని కూర్చోలేదు ఈ గ్రామస్తులు. సరైన సమయంలో వారు చూపిన చొరవతో రెండు నిండు ప్రాణాలు దక్కాయి. చేయి చేయి కలిపారు… అద్భుతం చేశారు. వీరు చేసిన సాహసానికి నిజంగా హ్యాట్సాఫ్ అనాల్సిందే!
కోవిడ్ రిస్ట్రిక్షన్స్ సడలించటంతో జనం పుణ్యక్షేత్రాలకి, టూరిస్ట్ ప్లేసెస్ కి ఎక్కువగా వెళుతున్నారు. అలానే, తమిళనాడులోని అనైవారి జలపాతానికి కూడా టూరిస్టులు పోటెత్తారు. అనైవారి వాటర్ ఫాల్స్ అనేది పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇక్కడి పచ్చని ప్రకృతి, జలపాత హోయలను చూసేందుకు టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు.
అయితే, మిగిలిన రోజుల్లాగే ఈ ఆదివారం కూడా ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వచ్చారు. వీరంతా అందమైన జలపాతాన్ని చూసి మైమరిచిపోయి ఉన్నారు. ఇంతలో సడెన్ గా నీటి ఉదృతి పెరిగింది. టూరిస్టులు అంతా ఒకవైపు ఉంటే… ఒక మహిళ మాత్రం తన బిడ్డతో కలిసి ఒక రాక్ పై కూర్చొని ఆ వాటర్ ఫాల్స్ చూస్తుంది.
ఎప్పుడైతే, వాటర్ ఫాల్స్ ఫోర్స్ పెరిగిందో… ఆ మహిళ తన బిడ్డతో సహా అందులో చిక్కుకుంది. పర్యాటకులు చూస్తుండగానే జలపాతం మరింత ఉగ్రరూపం దాల్చింది. దీంతో జనం పరుగులు పెట్టారు. ఆమెను రక్షించేందుకు పెద్ద ఎత్తున కేకలు పెట్టారు.
ఒక వైపు టూరిస్టులు… ఇంకో వైపు ఆ మహిళ… మద్యలో జల ప్రవాహం… క్షణ క్షణానికీ పెరుగుతున్న నీటి ప్రవాహానికి ఎప్పుడేం జరుగుతుందో అని అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు.
దీంతో స్థానికులు కలుగచేసుకొని… వారి ప్రాణాలని పణంగా పెట్టి మరీ ఆ మహిళని రక్షించేందుకు రెడీ అయ్యారు. అందరి నడుములకి ఉన్న బెల్టులను ఊడదీసి… దాన్ని ఓ తాడులా మలిచి… దాని ఆధారంగా ఆ ఇద్దరిని రక్షించి… సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
అయితే, ఈ ప్రయత్నంలో ఓ ఇద్దరు విలేజర్స్ కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయారు. అయినప్పటికీ భయపడకుండా ఈదుకుంటూ సమీపంలోని ఒడ్డుకు వచ్చారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఇన్సిడెంట్ కారణంగా ఈ వాటర్ ఫాల్స్ ని టెంపరర్లీ రిస్ట్రిక్ట్ చేశారు. అయితే గ్రామస్థులు చూపిన దైర్యానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసల జల్లు కురిపించారు.
\
தாயையும் சேயையும் காப்பாற்றியவர்களின் தீரமிக்க செயல் பாராட்டுக்குரியது; அரசால் சிறப்பிக்கப்படுவார்கள்.
தன்னுயிர் பாராது பிறரது உயிர் காக்க துணிந்த அவர்களது தீரத்தில் மனிதநேயமே ஒளிர்கிறது!
பேரிடர்களின்போது பொதுமக்கள் கவனமுடன் இருக்க வேண்டும்.
பண்புடையார்ப் பட்டுண்டு உலகம்! pic.twitter.com/NRCb8OE8l3
— M.K.Stalin (@mkstalin) October 26, 2021