Alligator Attack on అ Man Swimming in the River

చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై ఎలిగేటర్ ఎటాక్… చివర్లో ట్విస్ట్ అదిరింది (వీడియో)

ఎలిగేటర్‌ అంటేనే దాని భారీ ఆకారంతో భయం పుట్టిస్తుంది. దాన్ని దూరం నుంచి చూస్తేనే భ‌య‌ప‌డిపోతాం. మరి అలాంటిది దగ్గర నుంచీ చూస్తే… ఇంకేమైనా ఉందా..!  

సరే! ఈ విషయం పక్కనపెడితే… ఏదో టైమ్ పాస్ కి చెరువులో ఈత కొడుతున్న ఓ వ్యక్తిని అనుకోని అతిధిలా వచ్చి పలకరించింది ఓ ఎలిగేటర్‌. మాములుగానే మొసలికి బలమెక్కువ. అందులోనూ అది ఎలిగేటర్ కాబట్టి మరింత బలం ఉంటుంది. దీనికితోడు అది నీళ్ళల్లో ఉంది.  నీళ్లలో ఉండే మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటారు. మరి అలాంటిది ఒక సామాన్య మనిషిని ఎటాక్ చేస్తే… ఇంకేమైనా ఉందా..!

బ్రెజిల్‌లోని ఓ టూరిస్ట్ ప్లేస్ లో ఉన్న చెరువులో సరదాగా ఓ వ్య‌క్తి ఈత కొడుతున్నాడు. అతని వెనుక నుంచి ఒక ఎలిగేటర్ అత‌డి వైపుకే దూసుకు వస్తుంది. కానీ, ఈ విషయం అతను గమనించలేదు. ఇంతలో సడెన్ గా ఆ ఎలిగేటర్ ఆయన్ని ఎటాక్ చేసింది. ఇక నాపని అయిపోయినట్లే… అనుకున్నాడు.

అయితే, నీళ్ళల్లో దానికి ఏం అడ్డు తగిలిందో తెలియదు కానీ అక్కడే ఆగిపోయింది. దీంతో ఆ వ్యక్తి సురక్షితంగా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. కాకపోతే, ఎలిగేటర్ దాడిలో అతని చేతికి గాయమైంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top