హిందువులు గంగా జలాన్ని ఎంత పవిత్రంగా చూస్తారో అందరికీ తెలిసిందే! గంగా నదిని దేవతా రూపంగాను, గంగ నీటిని పవిత్ర జలంగాను పరిగణిస్తారు. ఇక గంగలో స్నానమాచరిస్తే పాప పరిహారం జరుగుతుంది అని నమ్ముతారు. ఈ స్పీడ్ యుగంలో కూడా గంగామాత పట్ల ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారు కాబట్టే, ఇంకా ఈ భూమి మీద మంచి అనేది ఎక్కడో మిగిలి ఉంది.
సాదారణంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే గంగాజలాన్ని వాడుతుంటారు. ఇక కొంతమందైతే… గంగాజలాన్ని తమ ఇంట్లో తెచ్చి పెట్టుకోని భక్తితో కొలుస్తారు. అలా పూజించటం వల్ల తమ కుటుంబం అభివృద్ధి చెందుతుందని నమ్ముతారు.
అయితే, గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవటం మంచిదే కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా గంగాజలాన్ని ఇంట్లో బద్రపరిచినప్పుడు చాలామంది దానిని ఏదైనా ప్లాస్టిక్ సీసాలోనో, లేదంటే ఏదైనా డబ్బాలోనే నిల్వ ఉంచుతారు. అలా చేయకూడదు. ఎందుకంటే, ప్లాస్టిక్ స్వచ్చతని కలిగి ఉండదు. అందుకే, గంగాజలాన్ని వీలైనంత వరకు రాగి, ఇత్తడి, వెండి, లేదా మట్టి చెంబులలో మాత్రమే నిల్వ ఉంచాలి.
గంగాజలం ఇంట్లో ఉన్నప్పుడు సుచి, శుభ్రత పాటించాలి. అంతేకాదు, గంగాజలాన్ని నిల్వ ఉంచిన ప్రదేశంలో పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే తీసేయాలి. అలాగే, వంటగదికి దూరంగా కూడా ఉంచాలి.
గంగాజలం ఎంతో పవిత్రమైనది కాబట్టి దీనిని చీకటిగా ఉన్న ప్రదేశంలో ఎప్పుడూ ఉంచకూడదు. అలాగే దాని చుట్టుప్రక్కల ప్రదేశాలలో కూడా మురికి లేకుండా చూసుకోవాలి.
మురికి చేతులతో గంగాజలాన్ని తాకకూడదు. అలా తాకితే గంగానీటిని అపవిత్రం చేసినట్లే! అందుకే, చేతులను బాగా వాష్ చేసుకొన్న తర్వాతే ఈ నీటిని ముట్టుకోవాలి.