మన హీరోలంతా ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వర్కౌట్స్ చేయటం, బాడీ షేప్ మైంటైన్ చేయటం, హెల్దీ డైట్ తీసుకోవడం వంటి విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
ఇక ప్రస్తుత హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా దీనికి ఏ మాత్రం తీసిపోరు. సినిమా సినిమాకి ఎన్నో వేరియేషన్స్ చూపించే ఎన్టీఆర్… తాజాగా రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం భారీ వర్కౌట్లే చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ చేసే వర్కౌట్స్ వీడియో ఒకటి రివీల్ అయింది. ఈ వీడియోలో జిమ్లో ఎన్టీఆర్ తన రెండు కాళ్లతో హెవీ వెయిట్లను ఎత్తుతూ… ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక చివరికి ఆ బరువుని పూర్తిగా పైకి ఎత్తలేక తన ట్రైనర్ సహయం తీసుకున్నాడు. ఈ వీడియోని ఎన్టీఆర్ ఫిట్ నెస్ ట్రైనర్ తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేశారు.
View this post on Instagram