సూపర్ 12 గ్రూపు2 మ్యాచ్ లో భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లకీ ఇది చాలా కీలకమైన మ్యాచ్ కావటంతో… పోటీ చాలా హోరాహొరీగా ఉంటుందిని అనుకున్నారంతా. కానీ, 66 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
ఈ విషయం పక్కనపెడితే, ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ తన బౌలింగ్ స్టైల్ తో ఈ మ్యాచ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని ఇమిటేట్ చేస్తూ… తన బౌలింగ్ కొనసాగించాడు నవీన్. వీరిద్దరి విజువల్స్ ని పోల్చి చూపిస్తూ వస్తున్న ఓ వీడియో ప్రస్తుతం తెగ ట్రోల్ అవుతుంది.
మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో ఈ వీడియోని ప్లే చేయటంతో… ఆఫ్ఘన్ బౌలర్ అది చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఈ వీడియోలో ఇద్దరూ కూడా సేమ్ టూ సేమ్ ఒకేలా బౌలింగ్ చేశారు. క్లిప్పింగ్ లో పాయింట్ టూ పాయింట్ పోల్చుతూ ఈ వీడియో ప్రదర్శించారు.
— pant shirt fc (@pant_fc) November 3, 2021