కింగ్ కోబ్రాని దూరంనుండీ చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది వేట మొదలైందో… ఇక అంతే సంగతులు.! సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు కొత్తేమీ కాకపోయినా… ఈ వీడియో మాత్రం చూస్తే ఒళ్ళు ఝాలదరిస్తుంది.
దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్లో ఒక సంఘటన జరిగింది. ఓ ఉడుము నాగుపాముకి చిక్కింది. కోబ్రాకి చిక్కిందంటే… ఇక ప్రాణాలు పోయినట్లే! అయినా కూడా ఆ ఉడుము చాలాసేపటివరకూ కదలకుండా అంతే ఉంది. అది చూసి పాము కూడా ఏమీ చేయలేదు.
కొంతసేపటికి కోబ్రా వేట మొదలుపెట్టింది. పాము బారినుంచి తప్పించుకునేందుకు ఉడుము చాలా ట్రై చేసింది. కానీ, లాభం లేకుండా పోయింది. కోబ్రా ఉడుముని చుట్టేసి అమాంతం మింగేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోని ‘లేటెస్ట్ సైటింగ్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ అప్ లోడ్ చేసింది.