ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈరోజు వీరచక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్న అభినందన్… బాలాకోట్ లో జరిగిన వైమానిక దాడుల్లో… పాక్ ఆర్మీతో వీరోచితంగా పోరాడారు. ఈ కారణంగా అభినందన్ వీరచక్ర పురస్కారాన్ని అందుకొన్నారు. గతంలో కూడా పాకిస్తానీ వాయు చొరబాట్లను అడ్డుకొన్నందుకు శౌర్య చక్ర పురస్కారాన్ని అందుకున్నారు.
2019, ఫిబ్రవరి 26న, బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరంపై ఇండియన్ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఫిబ్రవరి 27న, LOC వద్ద F-16, F-17 పాక్ యుద్ధ విమానాలని గమనించాడు. ఏదో ముప్పు రాబోతుందని ఊహించాడు. ఎంతో సాహసోపేతంగా, చాలా చాకచక్యంగా తన దగ్గర ఉన్న మిస్సైల్‌తో ఆ విమానాలని కూల్చేశాడు.
F-16 ఎయిర్‌క్రాఫ్ట్‌తో డాగ్‌ఫైట్ చేస్తున్నప్పుడు, అభినందన్ యొక్క MiG-21 బైసన్ విమానం POK లో కుప్పకూలింది. వెంటనే, ప్యారాచూట్ సహాయంతో పాక్ లో ల్యాండ్ అయ్యాడు. అది గమనించిన పాకిస్తాన్ ప్రజలు అతనిపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ దళాలు అభినందన్ ని బంధించి, కళ్లకు గంతలు కట్టి వారి సైనిక స్థావరానికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఆయన్ని పాక్ ఆర్మీ చిత్రహింసలు పెట్టిన వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు. చివరికి భారత దౌత్యవేత్త ఒత్తిడితో అతనిని విడుదల చేశారు. ఆయన చేసిన ఈ వీరోచిత పోరాటానికి గుర్తుగా భారత ప్రభుత్వం అభినందన్ ని వీర చక్ర పురస్కారంతో సత్కరించింది.
#PresidentKovind presents #VirChakra to Group Captain #AbhinandanVarthaman for shooting down a Pakistani F-16 fighter aircraft during aerial combat on February 27, 2019. pic.twitter.com/NKqGJmx4Ku
— PIB India (@PIB_India) November 22, 2021