Ravana World's First Aviator says Sri Lanka

ప్రపంచంలో మొట్టమొదటిగా విమానాలని ఉపయోగించింది రావణుడే! ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు..! (వీడియో)

రామాయణ మహాకావ్యంలో రాముడికి ఎంత విశిష్టత ఉందో… రావణుడికీ అంతే విశిష్టత ఉంది. ముఖ్యంగా, రావణుడు ఉపయోగించిన వాహనాల గురించి ఇప్పటికీ రీసర్చ్ జరుగుతూనే ఉంది. లంకేశుడు ఆ కాలంలోనే విమానాలని ఉపయోగించినట్లు ఆధారాలు చెప్తున్నాయి. 

రావణ ది ఫస్ట్‌ ఏవియేటర్‌ అని శ్రీలంక ప్రజలు నమ్ముతారు. ఆ విమానంలో రావణుడు…  శ్రీలంక నుంచి భారత్‌కి ప్రయాణించినట్లు చరిత్ర చెప్తుంది. నేటి తరం విమానం వలే లేకున్నా… పుష్పక విమానం అనే పేరుతో ఉండేది. అంతేకాదు, ఈ విమానం ల్యాండ్ అవ్వటానికి ఏరోడ్రమ్స్ కూడా ఉన్నట్లు స్పష్టమవుతుంది. అయితే, ఇది కేవలం కల్పితమని కొట్టిపారేసే వాళ్లూ లేకపోలేదు.

అయితే, రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? లేదా? అనే విషయం గురించి తెలుసుకోవటానికి… శ్రీలంక గవర్నమెంట్ గతంలోనే ఓ రీసర్చ్ టీమ్ ని ఏర్పాటు చేసింది. గతేడాది కరోనా కారణంగా నిలిచి పోయిన ఈ రీసర్చ్ పనులు మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే, ఈసారి ఈ పరిశోధనల్లో ఇండియన్ గవర్నమెంట్ కూడా పాల్గొనాలని శ్రీలంక పరిశోధన బృందం కోరింది. ఈ అంశంపై పరిశోధనలు చేయటానికి శ్రీలంక ప్రభుత్వం 5 మిలియన్‌ శ్రీలంకన్‌ రూపీస్‌ ఫండ్స్ ని రిలీజ్ చేసింది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top