Mayan Muni, Hindu Mythology

Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology

మనకి తెలిసి ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఈజిప్ట్ నాగరికత, సింధు నాగరికతలు ముఖ్యమైనవి. కానీ, మనకి తెలియని అతి పురాతనమైన, శక్తివంతమైన నాగరికత ఒకటి ఉంది. భూమి పుట్టిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి నాగరికతగా దీనిని చెప్తారు. కానీ, అలాంటి నాగరికత గురించి ప్రపంచం రహస్యంగా ఉంచింది. అంతేకాదు, ఈ ప్రపంచానికి నాగరికతని పరిచయం చేసిన ఆ వ్యక్తి గురించి కూడా చరిత్ర దాచి ఉంచింది. దీనికి కారణం ఏమిటి? ఇంతకీ ఆ నాగరికత ఏది? దానిని పరిచయం చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఈ విషయాలన్నీ చరిత్ర ఎందుకు రహశ్యంగా ఉంచింది? ఇలాంటి విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. 

మొట్టమొదటి నాగరికత ఏది? దానిని ఎవరు రాశారు?

భూమి పుట్టగానే ఏర్పడిన మొట్టమొదటి నాగరికత మయన్ నాగరికత. దీనికి ఆధారాలు కూడా లేకపోలేదు. పురాణాల ప్రకారం రామాయణ యుద్ధం జరిగి సుమారు 10 వేల సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో దక్షిణ భారత దేశాన్ని శ్రీలంకతో కలుపుతూ ఒక వారధి ఉండేది.  దానినే “ఆడమ్స్ బ్రిడ్జ్” లేదా “రామసేతు” అంటారు. 

“ఆడమ్” మరియు “ఈవ్” ఈ ప్రపంచంలో మొట్టమొదటి మానవులు. వీళ్ళనుంచే మానవ జాతి పుట్టిందని చెబుతారు. “ఆత్మ” అనే పదం నుంచీ “ఆడమ్”, “జీవం” అనే పదం నుండీ “ఈవ్” పుట్టిందని అంటారు. ఈ విషయాలన్నీ సంస్కృతంలో ఎప్పుడో రాయబడి ఉన్నాయి. 

దీన్నిబట్టి చూస్తే, మానవ జాతి పుట్టటానికి ముందే ఈ నాగరికత పుట్టింది. అదికూడా ఆడమ్స్ బ్రిడ్జ్ దగ్గరే పుట్టింది.  అక్కడినుండీ ప్రపంచంలోకి విస్తరించింది. అంటే భాష అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే ఇక్కడ ఒక మహా నాగరికత పుట్టినట్లు తెలుస్తోంది. ఈ మహా నాగరికతకి ఆద్యుడు మహాముని మాయన్.

సైన్స్ అంటే ఏమిటో తెలియని ఆ రోజుల్లోనే ఎన్నో ప్రయోగాలు చేశాడాయన. భాష అంటే ఏమిటో తెలియని ఆ రోజుల్లోనే ఒక భాషని సృష్టించాడు. ఆ భాష పేరే “ప్రోటో ద్రావిడన్”. ఇది తమిళ భాషకి చాలా దగ్గరగా ఉండేది. ఈ భాషలోనే ఆయన “ప్రణవ వేదం” అనే పుస్తకాన్ని రచించారు. మరి ఈ మాయన్ ఎవరో… ఈయన గొప్పతనం ఏమిటో… మానవ నాగరికతకి ఆద్యుడుగా ఎందుకు నిలిచాడో ఇప్పుడు తెలుసుకుందాం.

మాముని మాయన్ ఎవరు?

తమిళ సాహిత్య గ్రంధాల ప్రకారం, మాముని మాయన్ పండితులు మరియు పూజారుల కుటుంబంలో జన్మించాడని చెబుతారు. ఇతని పుట్టుక గురించి పురాణాలు అనేక రకాల కథనాలు చెబుతాయి కానీ సరయిన ఆధారం అయితే లేదనే చెప్పాలి. 

అతని కుటుంబీకులు అందరూ విద్యావేత్తలుగా, గొప్ప మేధస్సు కలవారిగా ఉండటం వలన, ఇంకా అతని ఇంటిలో ఎప్పుడూ ఆధ్యాత్మిక భక్తి వాతావరణం ఉండటం వలన బాల్యంలో అతని ఆలోచనలు కూడా వీటి చుట్టూనే ఉన్నాయి అంటారు. 

మాయన్ చిన్న వయస్సు నుండే వేద గ్రంథాలు మరియు నిర్మాణ సూత్రాలపై ఆసక్తిని, లోతైన అవగాహనను సంపాదించాడని చెబుతారు. దీని ప్రభావం యుక్తవయస్సు వచ్చేసరికి వాస్తుశిల్పం మీద ఇంకా అత్యద్భుతంగా భారీ నిర్మాణాల రూపకల్పనపై అతనికి మంచి పట్టు వచ్చేలా చేసింది. 

ఆస్ట్రేలియా, ఆఫ్రికా మరియు అమెరికాలను కలుపుతూ శ్రీలంక నుండి అంటార్కిటికా వరకు 4500కి.మీ పైగా విస్తరించి ఉన్న లెమురియా ఖండం దీనినే కుమారి ఖండం అని కూడా అంటారు ఈ ఖండంలోని ఇలమూరి దేశంలో ఇతను నివసించినట్లు నమ్ముతారు. కాలక్రమంలో ఈ పెద్ద భూభాగం ముక్కలుగా విడిపోయినప్పుడు ఏర్పడినదే భారతదేశం అని అంటారు.  

ఇక మాయన్ ని మాముని మాయన్ అనికూడా పిలుస్తారు. మాముని అంటే తెలుగులో “మహాముని” అని అర్ధం. ఈ మాముని మాయన్ తమిళులకు సంబందించిన వాడు అని చెబుతారు. వారి తమిళ భాష ప్రకారం ఈ మహాముని మాయన్ పేరు వాడుకలో మాముని మాయన్ అయ్యింది. ప్రస్తుతానికి మనం కూడా అదే కంటిన్యూ చేద్దాం.

తమిళ సాహిత్యంలో మాముని మాయన్ పాత్ర ఏమిటి?

మాముని మాయన్ అనేది తమిళ పురాణాలలో ఒక పాత్ర. తమిళ పురాతన శాస్త్రీయ సంగం సాహిత్యంలోని సిలప్పటికారం, మణిమేకలై ఇంకా సివాక సింతామణి వంటి రచనలలో ఇతని ప్రస్తావన చూడవచ్చు. 

అయితే ఇవన్నీ కొట్టిపారేసే విధంగా తమిళ పురాణాలలో, ఇంకా తమిళ సాహిత్యంలో ఉన్న ఒక కల్పిత పాత్ర ఈ మాముని మాయన్. దీనికి మూలం మహాభారత రామాయణ ఇతిహాసాలలో మనకు తెలిసిన మాయాసురుడు అని అంటారు. 

ఇది కూడా చదవండి: పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..?

మాముని మాయన్ కు మయాసురునికి గల సంబంధం ఏమిటి?

మాముని మాయన్ రాసిన రచనలు, ఇంకా వాస్తు శాస్త్రం అన్నీ మనం మహాభారతం, రామాయణం ఇతిహాసాలలో విన్న మయాసురుడు అనే గొప్ప దైవశిల్పి రాసినవిగా పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ మయాసురుడే మహాభారతంలో మయసభ కట్టిన గొప్ప దైవశిల్పి. ఇతను రామాయణ కాలంలో రావణాసురుడి భార్య అయిన మండోదరికి తండ్రి. 

అందుకే తమిళ పురాణ సాహిత్యంలో కనిపించే మాముని మాయన్ పాత్ర పుట్టుకకు, జీవితానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు అంటారు.

మయాసురుని ప్రాచీన రచనలు ఏమిటి?

వాస్తు శాస్త్రానికి ఆద్యుడిగా, పౌరాణిక స్థాపకుడిగా ఈ మాయాసురుడు గుర్తించబడ్డాడు. వాస్తు శాస్త్రంతో పాటు జ్యోతిర్గణిత సూర్య సిద్ధాంతం, బ్రహ్మ సూత్రం, యోగశాస్త్రం, తదితర గొప్ప పురాతన రచనలు చేసిన సాహితీవేత్తగా, అద్భుతమయిన నగరాలను నిర్మించిన దైవశిల్పిగా ఇతను ఘనత పొందాడు.   

మాయాసురుని వాస్తు మరియు శిల్ప నైపుణ్యం ఎట్టిది?

ఈ మయాసురుడు ఒక గొప్ప దేవశిల్పి. ఇతను ఎన్నో అద్భుతమయిన భవనాలను దేవతలకు, రాజులకు నిర్మించి ఇచ్చాడు. మహాభారత ఇతిహాసం ప్రకారం ఇంద్రప్రస్థలో ధర్మరాజు కోసం రాజభవనాన్ని, ఇంకా పాండవులకు మయసభను నిర్మించి ఇచ్చింది ఇతనే. రావణుడు పాలించిన శ్రీలంకకు వాస్తుశిల్పిగా ఉంటూ రావణుడి రాజభవనాన్ని కూడా నిర్మించాడు. ఇతని కుమారుడు నలన్ భారతదేశం మరియు శ్రీలంక మధ్య వారధి అయిన రామసేతును నిర్మించడంలో రాముడికి సహాయం చేశాడు అని చెబుతారు. 

ఇది కూడా చదవండి: Mysterious Powers of Katarmal Sun Temple

మాముని మాయన్ యొక్క సూర్య సిద్ధాంతం

మాముని మాయన్ సంస్కృతం మరియు తమిళం రెండింటిలో ఎన్నో రచనలు చేశాడు అని చెబుతారు. వీటిలో సూర్య సిద్ధాంతం చాలా ప్రముఖమయినది. ఇందులో మనకు తెలిసిన సోలార్ సిస్టమ్, గ్రహాలు వాటి కదలికలు, అవి తిరిగే సమయాలు, దూరాలు, వాటి డైరెక్షన్స్, ఇంకా వాటి మీద ఉండే రకరకాల వాతావరణ పరిస్థితులు, నక్షత్రాలు, గ్రహణాలు, ఇంకా వాటి గమనానికి మనిషి జీవితానికి ఉన్న సంబంధాలు… ఇలా ఎన్నో ఆశ్చర్యకరమయిన, ఆసక్తికరమయిన విషయాలు ఈ సూర్య సిద్ధాంతంలో మనం వివరంగా తెలుసుకోవచ్చు. 

మాముని మాయన్ ని దక్షిణామూర్తితో పోల్చవచ్చా?

భారతదేశంలో ఆలయ సంస్కృతి ప్రారంభం మరియు వ్యాప్తికి కూడా మాయన్ కారణమని చెప్పవచ్చు. ఈ మాయన్ మర్రి చెట్టు కింద కూర్చుని ఈ విశ్వం గురించి, ఇంకా ఎన్నో పవిత్ర కళల గురించి బోధించాడని, ఈయన సందేశాలతో ఈ భూమండలంలో ప్రతి పట్టణంలో సామాజిక అభివృద్ధి కోసం ఎన్నో దేవాలయాలు, ఇంకా సాంస్కృతిక కేంద్రాలు వెలిశాయని చెబుతారు. అతను దక్షిణ ప్రాంతానికి చెందినవాడు మరియు మర్రి చెట్టు క్రింద కూర్చున్నాడు కాబట్టి, ఇతనిని కొందరు తమిళులు దక్షిణామూర్తితో సమానం అని కూడా భావిస్తారు.

మాముని మాయన్ మాయాసుర వంశస్థుడా లేక ఇద్దరూ ఒకరేనా?

ఈ విషయంలో కూడా చాలా సందిగ్ధం కొనసాగుతోంది. చాలామంది రామాయణ మహాభారత ఇతిహాసాలలో చెప్పుకున్న మాయాసురుడి వంశస్థుడే ఈ మాముని మాయన్ అంటారు. 

అయితే, ఈ మాముని మాయన్ పాత్ర తమిళ సాహిత్యంలో ఒక పాత్ర అయినప్పటికీ, ఆ పాత్రకు మూలం మాయాసురుడే అని, అందుకే వీరి రచనలు, నిర్మాణ మరియు శిల్పకళా నైపుణ్యాలు అన్నీ ఒక్కటిగానే ఉన్నాయని అంటారు. కాబట్టి  వీళ్లిద్దరూ ఒకటే అని మరికొంతమంది బలంగా వాదిస్తారు. 

కానీ, నిజానికి మాముని మాయన్ ఒక గొప్ప ముని. ఇంకా గొప్ప శివ భక్తుడు కూడా. ఈయన కనిపిట్టిన ప్రతి అంశాన్నీ శివునికి అంకితం ఇచ్చేవాడు. అంతేకాదు, వాస్తు ప్రకారం దక్షిణ దిక్కుని పాలించే వాడు దక్షిణామూర్తి అయిన శివుడు కాబట్టి దక్షిణానికి కాళ్ళు పెట్టి నిద్రించకూడదనే వాస్తు సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి ఈ మహాముని మాయన్.

ఇది కూడా చదవండి: సునామీని సైతం వెనక్కి నెట్టిన ఒకే ఒక్క ఆలయం

మాముని మాయన్ మూలాలు తమిళంలో ఉన్నాయా?

ఈ మాముని మాయన్ తమవాడే అని అతని మూలాలు తమ రాష్ట్రంలోనే ఉన్నాయని తమిళులు బలంగా నమ్ముతారు. తమిళ పురాతన శాస్త్రీయ రచన అయినటువంటి ఐంతిరం అనే తమిళ వ్యాకరణాన్ని ఇతనే రచించాడని చెబుతారు. 

ఇతను కుమారి ఖండంలో నివసించాడని నమ్ముతారు. ఈ కుమారి ఖండం కూడా ఒక కల్పిత ప్రాంతం అని అంటారు. ఇప్పటి ప్రపంచపటంలో భారతదేశంలోని కన్యాకుమారి, చైనా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాలను కలుపుతూ ఒకప్పుడు ఉండే పెద్ద ప్రాంతమే ఈ కుమారి ఖండం అని విశ్వసించేవారు. పురాణ ఇతిహాసాల ప్రకారం ఈ కుమారి ఖండం మయాసురుడు నివసించిన ప్రాంతం. ఈ విధంగా మాముని మాయన్ మయాసురుడి వంశస్థుడు అని తమిళులు తమ అభిప్రాయాన్ని సమర్ధించుకున్నారు. 

మరికొంతమంది చరిత్రకారులు ఈ మాయన్ వంశం శ్రీలంకలోని తమిళులకు సంబంధించిన వంశస్థులు అని, ఆ విధంగా ఈ మాముని మాయన్ రామాయణ మహాభారత కాలాలలో ఉన్న మాయాసురుడు వంశానికి చెందినవాడే అని చెప్పటం ప్రారంభించారు. 

కొంతమంది శాస్త్రవేత్తలు అసలు ఈ మాయన్ అంటే అర్ధం భ్రాంతి అని, ఈ పేరు చుట్టూ అల్లుకున్న కథలు అన్నీ కల్పితాలు అని తేల్చేశారు. 

మాయన్ పూర్వీకులు ఎవరు?

2019వ సంవత్సరంలో మెక్సికోలో ఆర్కియాలజిస్ట్ మాయన్ సివిలైజేషన్ కు సంబందించిన ఒక పురాతన భవన శిధిలాలను కనుగొన్నారు. ఇది కనీసం 1000 సంవత్సరాలకు ముందు కట్టిఉండవచ్చని అనుకుంటున్నారు.    

2021వ సంవత్సరంలో మెక్సికోలోని మాయన్ గుహగా పిలువబడే ఒక గుహలో డజన్ల కొద్దీ చేతిముద్రలు కనుగొన్నారు. ఇవి పురాతన మాయన్ ఆచారంలో భాగమని నమ్ముతున్నారు. 

పురావస్తు శాస్త్రవేత్త అయిన సెర్గియో గ్రోస్జీన్ దీని గురించి మాట్లాడుతూ ఈ చేతి ముద్రలు, వాటికి ఉన్న రంగులకు ఏదో అర్థం ఉందని, అది మాయన్ ఆచారంతో ముడిపడి ఉండే అవకాశం ఉన్నాడని చెప్పారు. చిన్న పిల్లల ముద్రలతో పోలిక ఉన్న ఈ ముద్రలు కనీసం 1,200 సంవత్సరాల కంటే పురాతనమయినవి అని గుర్తించారు.

వీరి ఉనికిని చాటి చెప్పే మరొక్క ఆధారం మాయన్ వంశస్థులకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక పెద్ద కలశం. US లోని మిచిగాన్ లోని ఒక కాలేజ్ లో ఒక పెద్ద కలశాన్ని 50 సంవత్సరాలకు పైగా భద్రపరచి ఉంచారు.ఇది  1969 నుండి భద్రపరచబడి ఉన్నది. దాదాపు 50 సంవత్సరాల తరువాత ఇది తిరిగి మెక్సికోకు తిరిగి వస్తోంది. ఈ కలశం 900 మరియు 1600 AD మధ్య తయారు చేయబడినదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

ఈ ఆధారాలను పరిశీలిస్తే మయన్లు ఇప్పుడు మనకు తెలిసిన సౌత్ మెక్సికో, గ్వాటెమల, బెలిజ్ ఇంకా హోండురాస్ దేశాల భూభాగాలను పాలించారు అని చెప్పవచ్చు. ఈ ప్రాంతాలు కుమారి ఖండంలో భాగంగా ఉంది ఎన్నో వేల సంవత్సరాల క్రితం విడిపోయి వేరే వేరే దేశాలుగా ఏర్పడ్డాయని చెప్పవచ్చు.

మాముని మాయన్ని ప్రపంచం ఎందుకు దాచిపెడుతుంది?

మాముని మాయన్ నాగరికత పుట్టుకకి కారణమయినప్పటికీ, అతను నివసించిన భూభాగం సముద్రంలో కలిసిపోవటం వల్ల చరిత్రలో ఈ నాగరికతకి సంబందించిన ఆనవాళ్ళే లేకుండా పోయాయి. అందుకే, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన సింధూ నాగరికత, ఈజిప్ట్ నాగరికత గురించి మాత్రమే చరిత్ర చెప్తోంది. కానీ, అంతకు ముందున్న మయన్ నాగరికత రహశ్యంగా మిగిలిపోయింది.

అసలు వేదాలని మొట్టమొదట రచించింది ఇతనే. ఈయన రాసిన వేదాలనే రామాయణ కాలంలో వేద వ్యాసుడు 4 భాగాలుగా విభజించటం జరిగింది. అంతేకాదు, వ్యాసుడే స్వయంగా  మాయన్ రచించిన వేదాలని తిరిగి విభజించి రాస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదంతా తెలియక చరిత్ర వేదాలని విభజించి రాశాడు కాబట్టి వ్యాసుడే ఆ వేదాలని రచించాడని చెబుతూ వచ్చింది. 

సోలార్ సిస్టమ్ ని కనిపిట్టింది నికోలస్ కోపర్నికస్ అని చరిత్ర చెప్తోంది. ఈయన సూర్యుడు విశ్వానికి మధ్యలో ఉన్నాడని, గ్రహాలు దాని చుట్టూ ఖచ్చితమైన కక్ష్యలో తిరుగుతాయని ప్రతిపాదించాడు. అందుకే ఈయన్ని “ఫాదర్ అఫ్ ది సోలార్ సిస్టమ్” అని పిలుస్తారు. అలానే పుస్తకాల్లో కూడా రాశారు. కానీ, గ్రహాలు వాటి కదలికలు, అవి తిరిగే సమయాలు, దూరాలని ముందే కనిపెట్టి చెప్పింది ఈ మాయన్ ముని అన్న విషయం చరిత్ర పరిగణలోకి తీసుకోలేదు.

ఇక ఈజిప్టు, మెక్సికో నగరాల్లో ఉన్న గ్రేట్ పిరమిడ్స్ వారి నిర్మాణ సామర్ధ్యంగా చెప్పుకుంటారు. కానీ, వీటన్నిటి నిర్మాణం వెనుక మాయన్ ముని కనిపెట్టిన ఇంజనీరింగ్ టెక్నాలజీనే ఆధారం అని ఎవరికీ తెలియదు. 

ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక విషయాల్లో మాయన్ మునికి సంబంధించిన విషయాలు చాలా గోప్యంగా ఉంచబడ్డాయి. అసలు మానవ చరిత్ర ఏమిటి అంటే… అది మాయన్ చరిత్రతో ముడిపడి ఉంది. అంతేకాదు, మానవ నాగరికత అనేది మొట్టమొదట మన భారతదేశంలోనే  పుట్టింది. ఇక్కడి నుండే విదేశాలకి వెళ్ళింది. కానీ, దీనంతటికీ కారణమైన మాముని మాయన్ ని మాత్రం ఈ ప్రపంచం మరిచిపోయింది. 

ముగింపు 

ఏది నిజం ఏది కల్పితం అని నిర్ణయించే సామర్ధ్యం, ఆధారాలు మనకు లేనప్పటికీ… ఈ మాయన్ ముని స్టోరీ మాత్రం చరిత్రని సృష్టించింది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. 

2004లో, ఈ మాముని మాయన్ స్మారక చిహ్నం కూడా తమిళనాడులోని మహాబలిపురం దగ్గర నిర్మించే ప్రయత్నం జరిగింది. అంటే ఈ మాముని మాయన్ తమవాడే అని తమిళులు బలంగా నమ్ముతున్నట్లే కదా!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top