Yamaraj and Yami, Hindu Mythology

Yamaraj and Yami’s Cosmic Connection

హిందూ మతం మొదటినుంచీ ఈ ప్రపంచానికి వాల్యూస్ ని పరిచయం చేస్తూ వచ్చింది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల రూపంలో వాటిని ప్రజలకి అందించింది. అదే హిందూ మతం మనిషి ఈ సొసైటీలో మొరాలిటీతో ఎలా బతకాలో కూడా నేర్పించింది. అయితే, ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ టాపిక్ లో నైతిక విలువలు పాటిస్తూ, ధర్మ బద్దంగా నడుచుకున్నందుకు యమ God of Mortality గా ఎలా మారాడు? అలానే, ప్రేమని పంచుతూ, భక్తి పూర్వకంగా నడుచుకున్నందుకు యమీ Goddess of  Immortality గా ఎలా మారింది? అసలు వీరి మద్య ఉన్న రిలేషన్ ఏంటి? వీరి రిలేషన్ నెక్స్ట్ జెనరేషన్ కి ఎలాంటి లైఫ్ లెసన్స్ నేర్పించింది అనేది ఈ స్టోరీలో చూద్దాం.

యమ మరియు యమీల పుట్టుక వెనుక కథ

మార్కండేయ పురాణం ప్రకారం, దేవశిల్పి అయిన విశ్వకర్మ తన కూతురు సంజనని సూర్య భగవానుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈమెనే ‘శరణ్యు’ అని కూడా పిలుస్తారు అయితే, సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉండటంతో… సంజన ఆ కిరణాల వేడిని తట్టుకోలేక పోయేది. 

సంజన గర్భం ధరించి ఉన్నప్పుడు ఒకసారి సూర్యుడు ప్రేమగా తన దగ్గరికి రాగానే… ఆ ప్రకాశాన్ని చూడలేక భయంతో కళ్ళు మూసుకొంది. వెంటనే సూర్య భగవానుడు దానిని అవమానంగా భావిస్తాడు. కోపంతో నీకు పుట్టబోయే సంతానం జీవుల మరణానికి కారణమవుతాడని శపిస్తాడు. 

ఆమె భయంతో ఒణికిపోతూ మళ్ళీ ఆయనని చూడటానికి ప్రయత్నిస్తుంది. ఈసారి కళ్ళు తెరిచి ఉంచడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తుంది కానీ, కళ్ళు తెరవలేక, మూయలేక నానా ఇబ్బందులూ పడుతూ చివరికి మళ్ళీ కళ్ళు మూసుకొంటుంది. ఈసారి సూర్యుడు దానిని మరింత అవమానంగా భావిస్తాడు. పట్టరాని కోపంతో నీకు పుట్టబోయే సంతానం చెంచెలమైనదిగా ఒంపులు తిరుగుతూ జీవుల జీవితానికి కారణమవుతుందని శపిస్తాడు. 

అలా సూర్య మరియు సంజన దంపతులకి యమ మరియు యమి అనే పేరుతో ట్విన్స్ పుడతారు. వీరిలో యమ జీవులు మరణించటానికి కారణమైతే, యమీ జీవులు జీవించటానికి కారణమవుతుంది. 

యమ అంటే ఏమిటి?

“యమ” అనే పేరు సంస్కృత పదం “యం” నుండి పుట్టింది. దీని అర్థం “నిగ్రహం” లేదా “నియంత్రణ”. ఎందుకంటే ఇతను చనిపోయినవారి ఆత్మలను నియంత్రిస్తాడు. అలాగే వాళ్ళు తమ జీవితంలో చేసిన కర్మల ఆధారంగా శిక్షలు విధిస్తాడు. ఇంకా మరణానంతర జీవితాన్ని ప్రసాదిస్తాడు.

ఇంకా యమను కాలా – అంటే ‘సమయం’, పాశి – అంటే పాముని  మోసేవాడు’ మరియు ధర్మరాజు – అంటే ‘ధర్మ ప్రభువు’ వంటి అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.

మరణం మరియు అమత్వం కలపటం

పురాణాలలో, యముడిని నాలుగు చేతులు, పొడుచుకు వచ్చిన కోరలు, మేఘాల ఛాయ కలిగి ఉండి, చూడటానికి ఎంతో కోపంతో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఎరుపు, పసుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి; ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో పాశం పట్టుకొని, గేదె మీద స్వారీ చేస్తూ,  జ్వాలా మేఘాల పైన తిరుగుతున్నట్లు చెప్తారు. ఈ క్రమంలో అతను  చనిపోబోతున్న వ్యక్తుల జీవితాలను తన పాశం విసిరి స్వాధీనం చేసుకుంటాడు. దీనినే ‘యమపాశం’ అంటారు. 

హిందూ మతం, బౌద్ధమతం మరియు కొన్ని ఇతర మతాలలో యముడిని ఓ దేవునిగా భావిస్తారు. హిందూ మతంలో అతను మరణం, న్యాయం మరియు ధర్మానికి దేవుడు. అలాగే, అతను ఓ భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నట్లుగా  చిత్రీకరించబడతాడు. 

సాదారణంగా యముడు మరణించిన వ్యక్తి తన జీవితంలో చేసిన కర్మల ఆధారంగా అతనికి శిక్షలు విధించటం కోసం అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. శిక్షా కాలం పూర్తవగానే తిరిగి అతనికి మరో జీవితాన్ని కల్పిస్తాడు. ఈ విధంగా యమ మొరాలిటీ మరియ ఇమ్మొరాలిటీని కనెక్ట్ చేస్తాడు. 

యమి అంటే ఏమిటి?

‘యమి’ అనే పేరు సంస్కృత పదం “యమ” నుండి పుట్టింది. దీని అర్థం “జంట”. ఎందుకంటే, ఈమె జనుల పాపాలను కడిగివేసి, మోక్షాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు.

ఇంకా యమిని సూర్యతనయ, సూర్యజ, రవినందిని, కాళింది, యమునా అనే పేర్లతో కూడా పిలుస్తారు.

మరణాన్ని తొలగించి అమరత్వాన్ని ఇవ్వటం 

అగ్ని పురాణం ప్రకారం, యమునా దేవి తరచుగా పర్వతం, లేదా తాబేలుపై నిలబడి, నీటి కుండని కానీ లేదా పూల దండని కానీ పట్టుకుని ఉన్న ఓ అందమైన యువతిగా చిత్రీకరించబడింది. 

ఆమె స్వచ్ఛత, ప్రేమ మరియు భక్తితో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే, ప్రజలను శుద్ధి చేసి, మోక్షాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. యమీ ఒక ప్రేమగల దేవత అని చెప్పవచ్చు. ప్రజల పాపాలన్నిటినీ కడిగివేసి, వారిని మరణం పట్ల నిర్భయంగా మార్చే శక్తి ఉందని నమ్ముతారు. ఈవిధంగా యమి మొరాలిటీని పోగొట్టి ఇమ్మొరాలిటీని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Kalabhairavas Connection to Kashi Vishwanath

యమ, యమీల అనుబంధం

ఋగ్వేదం ప్రకారం, మరణం ప్రాప్తించేలా పుట్టిన మొట్ట మొదటి మానవులు యమ మరియు యమి. అంతేకాదు, మరణానంతర జీవితానికి వెళ్ళిన మొదటి జీవి యమ  అయితే ప్రేమే జీవితంగా గడిపిన మొదటి జీవి యమి. యమ మరియు యమి కవలలుగా పుట్టటం మాత్రమే కాదు, ఒకళ్ళు మరణాన్ని తెస్తే, మరొకరు జీవితాన్ని తీసుకువస్తారు. అందుకే, యమ మరియు యమిని “divine pair of creator deities” అని పిలుస్తారు.

అప్పట్లో ప్రకృతిలో సమయం ముందుకు వెళ్ళేది కాదు. రాత్రి అనేదే లేకుండా ఎప్పుడూ సూర్యుడు ప్రకాశిస్తూ పగలు మాత్రమే ఉండేది. ఆ అందమైన ప్రపంచంలో యమ, యమీలు ఎంతో సంతోషంగా జీవించేవారు. అలాగే వారు ఒకరినొకరు ఎంతో ప్రేమించుకునేవారు కూడా. భూమి వాసనలు, రుచులు, శబ్దాలు, దృశ్యాలు, గాలుల స్పర్శలు  వీటన్నిటి అనుభూతిని పొందుతూ ఆనందిస్తూ తిరిగారు.

వీళ్ళు నివసించిన చోట, ఎప్పుడూ పగలే ఉండేది. అలాగే, ఎప్పుడూ వసంత ఋతువే ఉంటుంది. సూర్యుడు అస్తమించలేదు, చంద్రుడు, నక్షత్రాల కాంతి రానే లేదు. సమయం అలానే నిలిచిపోయింది. నిన్న లేదు, రేపు లేదు. పువ్వులు ఎప్పటికీ వాడిపోలేదు. తేనెటీగలు తేనెతో పొంగి పొర్లుతున్నాయి. పక్షులు ఎగురుతూ అలసిపోలేదు. చెట్లు ఎప్పుడూ పండిన పండ్లతో నిండుగా ఉన్నాయి. ఈ శాశ్వతమైన, సంతోషకరమైన క్షణంలో, యమ మరియు యమి హంసల జంట మాదిరిగా స్వేచ్చగా తిరిగారు.

ఇలా ఉన్న వీరికి యుక్తవయసు వస్తుంది. వయసు రీత్యా వచ్చిన కోర్కెల కారణంగా యమి తన సోదరుడైన యమపై విపరీతమైన ప్రేమని పెంచుకొంటుంది. అతనిని తన భర్తగా ఉండమని కోరుకుంటుంది. అందుకు యమ ఒప్పుకోక పోగా, ఒకే రక్త సంబంధానికి చెందిన తమ మద్య ఇలాంటి సెక్సువల్ రిలేషన్ షిప్ ఎంతమాత్రం ఉండకూడదని మనుషుల మద్య ఉండాల్సిన నైతిక విలువల గురించి ఆమెకి వివరిస్తాడు. ఇంకా దేవతలు సైతం ఇలాంటి వివాహాలని సహించరని చెప్తాడు. 

దీంతో యమి విపరీతంగా బాధ పడుతుంది. కానీ, అతని అభిప్రాయంతో ఎంతమాత్రం ఏకీభవించలేక పోతుంది. పూర్వం దేవతలు కూడా ఇతరులను మోసం చేయడం, వ్యభిచారం చేయడం వంటి తప్పుడు పనులు ఎన్నో చేశారని యమి చెప్తుంది. అందుకే, నన్ను ప్రేమించి నాకు బిడ్డను ఇవ్వండి అని ప్రాధేయ పడుతుంది. 

మన పూర్వీకులు చేసిన పొరపాట్లను మనం ఎప్పుడూ చేయకూడదని, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలని నీతినీ, ధర్మాన్ని ఎప్పుడూ తప్పకూడదని యమ చెప్పాడు. అలాగే, బ్రహ్మ మనల్ని జంటగా పుట్టించాడు. ప్రకృతి నియమానికి విరుద్ధంగా మనం వెళ్లకూడదని కూడా చెప్తాడు. అందుకే, ఆయన యమ ధర్మరాజుగా కీర్తించ బడ్డాడు. 

ఒకసారి, యమి ఒంటరిగా తిరిగి వచ్చినప్పుడు, యమ ఒక చెట్టు కింద నిద్ర పోతున్నట్లు కనిపిస్తాడు. ఆమె అతనిని మెల్లగా పిలిచింది కానీ అతను సమాధానం చెప్పలేదు. ఇంకొంచెం పెద్దగా పిలుస్తుంది. అయినా సమాధానం లేదు. ఈసారి పెద్దగా అరిచింది, అప్పటికీ సమాధానం రాలేదు. భయంతో ఆమె అతన్ని మెల్లగా కదిలించింది. కానీ అతను కదలలేదు. అతని శరీరం చల్లగాను, నిశ్చలంగాను ఉన్నట్లు ఆమెకు అర్ధమైంది. అప్రయత్నంగా చూడగా అతని ఊపిరి ఆగిపోయినట్లు తెలిసింది.

ఏం జరిగిందో ఆలోచించే లోపే… తన సోదరుడు యమ ఇక ఈ ప్రపంచంలో లేడనీ, తానిక ఒంటరి అనీ అర్ధమైంది.  వెంటనే గుండెలవిసేలా రోదించటం మొదలు పెట్టింది. ఆమె మనసులోని దుఃఖమంతా కళ్ళ నుండి ప్రవహించడం ప్రారంభించింది. అది కన్నీళ్లుగా బయటపడింది. ఆమె కన్నీరు వరదలా పారి, నదిలా ఉప్పొంగి ప్రపంచాన్ని ముంచెత్తడం ప్రారంభించింది. ఇలా పుట్టిందే యమునా నది. ఆమె ఏడుపు భూమిని మరియు ఆకాశాన్ని కదిలించింది. ఆమె దుఃఖం, సముద్రం కంటే లోతైనది. 

దుఃఖిస్తున్న ఆమె హృదయం నుండీ ఒక తీవ్రమైన అగ్ని జ్వాల పుట్టింది. అది కనపడిన ప్రతి దానినీ దహించివేస్తూ వచ్చింది. అది చూసిన దేవతలు చాలా ఆందోళన చెందారు. యమి శోకం ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని వారు భయపడ్డారు. వెంటనే వారంతా యమీ దగ్గరికి వచ్చి  ఓదార్చటానికి ప్రయత్నించారు. కానీ, ఏమీ లాభం లేకపోయింది. “ఈరోజు యమ చనిపోయాడు!” అంటూ విలపించింది. నిరాశతో వాళ్ళంతా వెనుదిరిగారు. 

దీనికి సొల్యూషన్ గురించి దేవతలంతా విపరీతంగా ఆలోచించారు. అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. యమి యొక్క దుఃఖం తన సోదరునిపై ఉన్న ప్రేమ ఆమెకు ఈ రోజు మాత్రమే తెలుసు. నిన్న లేదు, రేపు లేదు. యమ మరణించాడన్న బాధ తగ్గాలంటే, ఈ రోజు ముగియాలి అంటే  రేపు ప్రారంభం కావాలి అనుకొన్నారు.

వెంటనే దేవతలు తమ శక్తినంతా కూడదీసుకొని సూర్యాస్తమయాన్ని సృష్టించారు. అప్పుడు నెమ్మదిగా ఈ ప్రపంచం రాత్రి అనే చీకటి దుప్పటిని కప్పుకొంది. జంతువులు మరియు పక్షులు నిద్రపోతున్నట్లుగా యమీ కూడా మొదటిసారిగా నిద్రపోయింది. ఆమె తిరిగి మేల్కొన్నప్పుడు ఆకాశంలో తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. అప్పుడు యమి తనలో తాను, “అయ్యో, యమ నిన్న చనిపోయాడు” అనుకొంది. 

సమయం గడిచేకొద్దీ, యమ మరణం యొక్క బాధను యమి మరిచిపోతూ వచ్చింది. ఇప్పుడామె దుఃఖాగ్ని జ్వాల క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆమె కన్నీళ్లు ఎండిపోయాయి. ఆమె దుఃఖం కారణంగా ప్రపంచానికి వచ్చిన ప్రమాదం కూడా మసకబారడం ప్రారంభించింది. దీనంతటినీ రాత్రి అనేది మరిపించింది. 

అప్పటినుండీ రాత్రి పగటిని అనుసరిస్తూ వస్తుంది. కాలచక్రం ప్రారంభమైంది, ఎందుకంటే కాలమే అన్ని దుఃఖాలను నయం చేస్తుంది. ఇక యమ మానవునిగా మరణించి, జీవితానంతర దేవుడిగా పునర్జన్మ పొందిన తరువాత మాత్రమే, రాత్రి కనుగొనబడింది అలాగే సమయం లెక్కించబడింది. 

వేద సాహిత్యం ప్రకారం, యమ ఈ భూమిపై ఫస్ట్ మోర్టల్ గా నిలిచాడు.  అతను చనిపోవటమే కాకుండా, మరణించిన తన పూర్వీకులు నివసించే “మరొక ప్రపంచానికి” మార్గాన్ని సృష్టించాడు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవలసిందే! అలా చనిపోయిన వారి ఆత్మల్ని వారి కర్మానుసారం శిక్షించే అధికారాన్ని యమ తీసుకొన్నాడు. మరణించిన మొదటి వ్యక్తి అయినందున, అతను మరణానికి అధిపతిగా పరిగణించబడ్డాడు. చివరికి యమ మరణానికి దేవుడుగా మారాడు.

ఇక యమీ ఈ భూమిపై ఫస్ట్ ఇమ్మోర్టల్ గా నిలిచింది. నదిగా మారిన యమున దేవతగా పూజించబడుతుంది. ఉత్తర భారతదేశంలో గంగా నదికి అతిపెద్ద ఉపనది యమున. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన నది అయిన గంగ తర్వాత యమున రెండవది. ఈ నది అన్ని ప్రధాన ఉపనదుల నుండి నీటిని పొందిన తరువాత గంగలో కలుస్తుంది. 

ఈ నది నీటిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అనేక దేవాలయాలు మరియు పవిత్ర స్థలాలు ఈ నది ఒడ్డున ఉన్నాయి. అందుకే ఈ నది యొక్క ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు నదిని సందర్శిస్తారు. 

యమున ఒక ప్రేమగల దేవత అని చెప్పవచ్చు. ప్రజలలో ఉన్న పాపాలన్నీ పోగొట్టి, వారిని పవిత్రంగా మార్చి, మరణం పట్ల వారికున్న భయాలన్నిటినీ తొలగించి, మోక్షాన్ని ఇస్తుంది. మరణం లేని మొదటి వ్యక్తి  అయినందున, యమి కాలానికి అధిపతిగా మారింది. చివరికి యమి జీవితానికి దేవతగా మారింది. 

ఈ విధంగా మరణానికి అధిపతిగా యమ; కాలానికి అధిపతిగా  యమి కొనసాగుతారు.

సృష్టికర్త మానవులని సృష్టించే క్రమంలో, భూమిపై జీవితం కొనసాగాలంటే స్త్రీని, ఆ జీవితాన్ని ముగించాలంటే పురుషుడ్ని సృస్తించారు. వీరిలో పురుషుని పేరు యమ మరియు స్త్రీ పేరు యమి. కాలచక్రం తిరగాలంటే, వీరిద్దరి మద్య సంభోగం అవసరమని వీళ్ళిద్దరికీ తెలుసు. అందుకే ఆ పనిని పూర్తి చేయమని యమీ యమని బలవంతం చేసింది. అది సృష్టికే విరుద్ధం కాబట్టి యమ అందుకు ఒప్పుకోలేదు. అతనిని మర్చిపోలేక యమి నదిగా మారుతుంది.

యమ మరియు యామి కి సంబందించిన పండుగలు

యమ ద్వితీయ లేదా భాయ్ దూజ్‌ 

ఈ ఫెస్టివల్ యమ మరియు యమికి డెడికేట్ చేయబడింది. దీపావళి ఐదవ రోజు అంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత కృష్ణ పక్షం రెండవ రోజున జరుపుకుంటారు. సోదర – సోదరి సంబంధానికి గుర్తుగా ఈ పండుగ వస్తుంది. దక్షిణ భారతదేశంలో దీనిని ‘కార్తికై దీపం’ అంటారు. ఉత్తర భారతదేశంలో ‘భాయ్ దూజ్‌’ గా పెర్కొంగారు.

ఈ రోజున యమ తన సోదరి అయిన యమిని చూడటానికి వస్తాడు. ఆమె అతనికి ఆర్తితో స్వాగతం పలికి, అతనికి ఇష్టమైన పిండి వంటలతో భోజనంపెట్టి, తన సోదరుడు దీర్ఘాయుష్షును పొందేలా నుదుటిపై తిలకం దిద్ది పంపుతుంది. ఇక తన సోదరి ప్రేమకు  సంతోషించి, కృతజ్ఞతతో ఆశీర్వదించి వెళతాడు. 

అయితే, మరొక సంస్కరణ ప్రకారం, నరకాసురుడిని చంపిన తర్వాత కృష్ణుడు తన సోదరి సుభద్ర వద్దకు తిరిగి వచ్చినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారని అంటారు.

యమునా చాత్

ఈ పండుగని చైత్ర మాసంలో ఆరవ రోజున జరుపుకుంటారు, ఇది యమునా నది పుట్టినరోజు వేడుకగా పరిగణించబడుతుంది. ఈ రోజున, మహిళలు స్వీట్లు, ఎర్రటి సిందూరం మరియు ఉడకని అన్నం సమర్పించడానికి నదిలోకి అడుగుపెట్టారు; ఆ తర్వాత ఎరుపు చీర, కంఠాభరణాలు, కంకణాలు, దువ్వెన, బిందెలు మరియు అద్దం యమునా దేవికి నైవేద్యంగా నీటి అంచున ఇసుకపై ఒదిలి పెడతారు.

చివరి మాట 

ఫైనల్ గా ఈ టాపిక్ గురించి చెప్పొచ్చేది ఏంటంటే, లైఫ్ అండ్ డెత్ అనేవి ఒకే తల్లి కడుపున పుట్టిన కవలలు  వంటివి. ఎప్పుడూ ఇవి ఒకదానితో మరొకటి కలిసే ఉంటాయి. ప్రతి మనిషి తన జీవితంలో న్యాయం, ధర్మం అనే నైతిక విలువలని పాటించినట్లైతే, మరణానంతరం కూడా జీవితాన్ని కొనసాగించవచ్చు. అందుకు సాక్షమే ఈ యమ అండ్ యమి స్టోరీ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top