నందమూరి నటసింహం బాలకృష్ణ వెండితెరపైనే కాకుండా… ఓటీటీలోనూ తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు. ఆహాలో వచ్చే అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో ఫుల్ కామెడీతో ప్రేక్షకులకి నవ్వులు పూయిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ రియాల్టీ షోకి మంచి టాకింగ్ వచ్చింది.
ఇక తాజాగా ఈ షోకి టాలీవుడ్ జక్కన్న డైరెక్టర్ రాజమౌళి విచ్చేశారు. డిసెంబర్ 17న స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు.
అందులో రాజమౌళి వచ్చీ రాగానే మీరు ఆల్రెడీ ఇంటలిజెంట్… ఆచీవర్ అని అందరికి తెలుసు కదా! ఇంకా ఈ తెల్ల గడ్డం ఎందుకు? అని బాలయ్య అడుగుతారు. దానికి రాజమౌళి గంభీరంగా తన గడ్డాన్ని సరిచేసుకుంటూ ఉంటారు.
ఇప్పటివరకు మన కాంబినేషన్ రాలేదు కదా! ఒకవేళ నా అభిమానులు నిన్ను బాలయ్యతో సినిమా ఎప్పుడు? అని అడిగితే… నీ సమాధానం ఏంటి? అని అడిగారు. దానికి తన మీసాలు మేలేస్తూ… ఓ సీరియస్ లుక్ ఇచ్చారు రాజమౌళి.
మీతో ఒక సినిమా చేస్తే అటు హీరోకి… ఇటు ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ల రెండు మూడు సినిమాలు ఫసకే కదా! అంటారు బాలయ్య. దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే అంటూ బాలయ్య పట్టుబట్టారు. అప్పుడు రాజమౌళి ఇది ప్రోమో అని నీకూ, నాకు, ఇక్కడున్నవాళ్ళందరికీ తెలుసు. ఆన్సర్స్ ఫుల్ ఎపిసోడ్లో చెబుతాను అంటూ జవాబిచ్చారు రాజమౌళి. మొత్తంమీద ఈ షోలో నవ్వులు పూయించారు బాలయ్య.