కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడిప్పుడే తన పంజా విసురుతున్న వేళ రాబోయే కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో… ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో… అనే భయం పట్టుకుంది. ఏదేమైనప్పటికీ ఈ ఏడాదికి గుడ్ బై చెప్పక తప్పదు, వచ్చే ఏడాదికి వెల్కమ్ చెప్పక తప్పదు.
అయితే, నూతన సంవత్సరం వస్తుందంటేనే… ఎన్నో ఆశలు, ఇంకెన్నో కోర్కెలు, మరెన్నో ఆశయాలతో ముందడుగు వేయాలని అందరం రెడీ అవుతాం. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరం మన లక్ ఎలా ఉందో పరీక్షించుకోవాలని కూడా వెతుకుతుంటాం.
అలాంటి వారందరికీ ఓ గుడ్ న్యూస్… మీరు ఈ 4 రాశుల్లో ఏదైనా ఒక రాశికి చెందిన వారైతే… మీరు ఏ పని తలపెట్టినా… అది సక్సెస్ అవుతుందట. మరి ఆ 4 రాశులు ఏవో… అందులో మీ రాశి ఉందో… లేదో… ఇప్పుడే చూడండి.
సింహ రాశి:
సింహ రాశి వారికి 2022 చాలా సంతోషాన్ని ఇస్తుంది. సంవత్సర ప్రారంభంలోనే మీ జీవితంలో ఎన్నో మార్పులు చేసుకుంటాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ తొలగిపోతాయి. మీ రెవెన్యూ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సక్సెస్ ను అందుకుంటారు. జాబ్ లో ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులైతే లాభాలు అందుకుంటారు.
కన్యా రాశి:
కన్యా రాశివారికి 2022 లక్కీయెస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ గా మంచి స్టేజ్ కి చేరుకుంటారు. ఈ రాశిలోని వ్యవసాయ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకి చెందినవారెవరైనా సరే వారందరికీ మంచి లాభాలు కలుగుతాయి. వీరికీ ఏడాది విజయం తమ వెన్నంటి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే ఈజీగా అధిగమిస్తారు. కెరీర్ పరంగా చూస్తే ఏడాది మొత్తం అనుకూలంగా ఉంది.
తులా రాశి:
తులా రాశి వారికి 2022 ఆదాయాన్ని పెంచుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ, ధైర్యంతో ముందడుగు వేసి, విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ముఖ్యంగా మార్చి తర్వాత శుభఫలితాలను అందుకుంటారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి 2022 మిశ్రమ ఫలితాలని అందిస్తుంది. ఏడాది మొదట్లో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. అయితే, జీవిత భాగస్వామితో మాత్రం చిన్న చిన్న విషయాలకే గొడవపడుతుంటారు. మొత్తం మీద కొత్త సంవత్సరం సక్సెస్ నే అందిస్తుంది.