సాధారణంగా వైల్డ్ యానిమల్స్ జంతువులని వేటాడటం ఏ డిస్కవరీ ఛానెల్ లోనో… నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ లోనో చూస్తుంటాం. కానీ, మన కళ్ళెదుటే అలాంటి దృశ్యం కనిపిస్తే… ఇంకేమైనా ఉందా! సరిగ్గా ఇలాంటి వీడియోనే ఇప్పుడు మేము మీకు అందివ్వబోతున్నాం.
రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కు ఓ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. వేలాదిమంది టూరిస్టులు ప్రతిరోజూ ఇక్కడికి వస్తుంటారు. ఎప్పటిలానే, . ఆ రోజు కూడా టూరిస్టులు రెండు సఫారి వాహనాల్లో ఎక్కి బయలుదేరారు. అయితే వారిని ఓ స్ట్రీట్ డాగ్ ఫాలో అవుతూ వచ్చింది.
కొంతదూరం అలా జర్నీ చేసిన తర్వాత పక్కనే ఉన్న పొదల్లో పులి అడికిలి విని టూరిస్టులు తమ సఫారీ వెహికల్స్ ని ఆపివేశారు. ఆ సమయంలో ఆ వీధి కుక్క కూడా నిలిచిపోయింది. అయితే, రోడ్డు సైడ్ పొదలచాటున దాక్కున్న ఈ పులి ఒక్కసారిగా తన పంజా విసురుతూ అమాంతం కుక్కపై విరుచుకుపడింది. వెంటనే దానిపై దాడి చేసి దానిని పొదల మాటుకు లాక్కుని వెళ్ళింది. అందరూ చూస్తుండగానే కుక్కని… ఆ పులి చంపేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Tiger kills dog inside R’bhore. In doing so it is exposing itself to deadly diseases such as canine distemper that can decimate a tiger population in no time. Dogs have emerged as a big threat to wildlife. Their presence inside sanctuaries needs to be controlled @ParveenKaswan pic.twitter.com/t7qDR1MvNl
— Anish Andheria (@anishandheria) December 27, 2021