లైవ్ రిపోర్టింగ్ అనేది ఎప్పుడూ ఛాలెంజింగ్ తో కూడుకొని ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు. కానీ, ఉద్యోగ రీత్యా చేయక తప్పదు. ఇలాంటి సందర్భంలోనే ఒక్కోసారి రిపోర్టర్లు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆ కోవకి చెందినదే!
టోరీ యోర్గీ అనే మహిళ WSAZ టీవీలో రిపోర్టర్ గా వర్క్ చేస్తుంది. ఈమె వెస్ట్ వర్జీనియాలోని డన్బార్ లో నైట్ టైమ్ వాటర్ మెయిన్ బ్రేక్ న్యూస్ గురించి లైవ్ బ్రాడ్ కాస్ట్ చేస్తుండగా… వెనుకనుంచీ పికప్ ట్రక్ ఆమెని ఢీకొట్టింది. దీంతో ఆమె వెంటనే రోడ్డుపై పడిపోయింది.
అదే సమయంలో స్టూడియోలో న్యూస్ చదువుతున్న రీడర్ టిమ్ ఇర్ర్ చాలా కంగారు పడిపోయాడు. వెంటనే ఏం జరిగిందో చెప్పమని కోరాడు. ఇంతలో తేరుకున్న టోరీ… నో ప్రాబ్లెమ్ అంటూ న్యూస్ కంటిన్యూ చేసింది.
అయితే అటు ట్రక్కు డ్రైవర్ ని, ఇటు న్యూస్ రీడర్ ని ఏక కాలంలో భయపెట్టినప్పటికీ ఆ రిపోర్టర్ మాత్రం లక్కీగా బయటపడింది. ఈ వీడియో క్లిప్ ని జనవరి 20న ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన జర్నలిస్టులంతా తమ ఎక్స్ పీరియన్స్ ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు.
“We’re good, Tim.” pic.twitter.com/9kn2YElDLK
— Timothy Burke (@bubbaprog) January 20, 2022