హిందూ సాంప్రదాయంలో వివిధ రకాల దేవతా మూర్తులని నిత్యం మనం ఆరాదిస్తూ ఉంటాం. అంతెందుకు, మన చుట్టూ ఉండే పంచ భూతాలని కూడా పూజిస్తూ ఉంటాం. అయితే, ఎవరి ప్రత్యేకత వారిదే!
ఇక నవ గ్రహాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఆలయాలకి వెళ్ళినప్పుడు నవగ్రహాలని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాం. కానీ అలాంటి నవగ్రహాలని ఇంట్లో మాత్రం పెట్టుకోం. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..?
ముఖ్యంగా నవ గ్రహాలలో శనిదేవునికి ఓ ప్రత్యేకత ఉంది. శనీశ్వరుడి దృష్టి మనపై పడకూడదని, అలాగే ఆయన మనల్ని కాపాడాలని పూజలు చేస్తుంటాం.
అయితే, ఆ పూజలన్నీ దేవాలయాలకే పరిమితం. కానీ, ఏ ఇంట్లోనూ శనీశ్వరుడి విగ్రహాన్ని పెట్టి పూజలు చేయరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవి:
- పూజ చేసేటప్పుడు శనీశ్వరుడి వైపు చూడకూడదు.
- శని దేవునికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు.
- శనీశ్వరుడి చూపు మనమీద పడకూడదు.
ఈ కారణాల వల్ల శని దేవుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించరు.