ఇతరులకు చెందిన ఈ వస్తువులను అస్సలు వాడొద్దు!

సాదారణంగా మన పెద్దవాళ్ళు ఇతరులకి చెందిన వస్తువులని వాడొద్దు అని హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే, ఆయా వస్తువులలో మనకి తెలియని నెగెటివ్ ఎనర్జీ దాగి ఉంటుందని వారి భయం. ఇక ఫ్రెండ్స్ అన్నాక చిన్న చిన్న వస్తువులు ఇచ్చి పుచ్చుకోవటం కామనే! కానీ, ఇలాంటి చిన్న చిన్న వస్తువులే ఒక్కోసారి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే కొన్ని వస్తువులని దూరం పెట్టటం మంచిది. మరి ఇతరులకు సంబంధించి మనం ఉపయోగించకూడని ఆ వస్తువులు ఏమిటో..! ఎందుకో..! ఇప్పుడు తెలుసుకుందాం.

కర్చీఫ్:

చాలామంది తమ ఫ్రెండ్స్ కి సంబంధించి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి కానీ ఒకరి కర్చీఫ్ మరొకరు మార్చుకొని వాడుకోవటం అలవాటు ఉంటుంది. అలా వాడటం వల్ల తరచూ తగాదాలు, గొడవలు జరుగుతుంటాయి. కొద్ది రోజుల్లోనే వాళ్ళ రిలేషన్ షిప్ బ్రేక్ అవుతుంది. 

వాచ్:

సాదారణంగా వాచ్ అన్నాక నెగెటివ్, మరియు పాజిటివ్ ఎనర్జీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అలాంటప్పుడు ఒకరి వాచ్ ని వేరొకరు పెట్టుకోవటం వల్ల ఒకరి గుడ్ టైమ్ వేరొకరికి బ్యాడ్ టైమ్ గా మారుతుంది.

రింగ్:

ఫింగర్ రింగ్స్ కూడా వేరొకరివి ఉపయోగించకూడదు. అలా చేస్తే, దాని ఇంపాక్ట్ అవతలి వ్యక్తి హెల్త్, కెరీర్, ఇన్కమ్ పై పడుతుంది.

పెన్:

ఎప్పుడూ కూడా మనం వేరొకరి పెన్ ని మన దగ్గర ఉంచుకోకూడదు. దీనివల్ల వారి కెరీర్ దెబ్బతింటుంది. ఒక్కోసారి వారి ఇన్కమ్  కూడా కోల్పోవలసి వస్తుంది.

డ్రెస్సెస్:

ఇతరుల దుస్తులు ఎప్పుడూ కూడా ధరించకూడదు. అలా చేస్తే, మనలో నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించి, అష్టకష్టాలు పడతాము. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top