రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచీ సొట్ట బుగ్గల్లో సాంగ్ రిలీజ్ (వీడియో)

మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”రామారావు ఆన్ డ్యూటీ”. నూతన దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్లు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే ఈ మూవీ నుంచీ వచ్చిన ‘బుల్ బుల్ తరంగ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా  ‘సొట్ట బుగ్గల్లో’  అనే సాంగ్ లిరిక్స్ ని రిలీజ్ చేశారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. మజిలీ’ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్, కర్ణన్ భామ రజిషా విజయన్ ఆయనకి జోడీగా నటిస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ సొట్ట బుగ్గల్లో సాంగ్. బ్యూటిఫుల్ లోకేషన్స్ లో రవితేజ మరియు దివ్యాంశ కౌశిక్ లపై చిత్రీకరించబడిన ఈ సాంగ్ లో రవితేజ స్టైలిష్ గా కనిపించనున్నారు. ఇక ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ ల మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సాంగ్ మొత్తం రవితేజ హీరోయిన్ ని ముద్దులతో ముంచెత్తేశాడు. అంతేకాదు, కొన్ని కొన్ని లిప్ లాక్ సీన్ లు కూడా ఉన్నాయి. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top