మహేష్ బాబు మాస్ లుక్ తో అలరించబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రంలో మహేష్ బాబుని సరి కొత్త కోణంలో చూపించబోతున్నాడు.
గతంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’, మరియు ‘మైండ్ బ్లాక్’ సాంగ్స్ తో తన ఆడియెన్స్ కి హుషారు తెప్పించిన నటుడు, మరియు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్… ఈ చిత్రం ద్వారా ‘మా మా మహేశా’ సాంగ్ తో మన ముందుకి రానున్నారు. సాయి కృష్ణ, మరియు జోనితా గాంధీ పాడిన ఈ పాట మహేష్ బాబులోని మాస్ లుక్ ని రివీల్ చేస్తుంది.
అందుకేనేమో! మహేష్ బాబు “మాస్ మోడ్ ఆన్!” అంటూ ట్వీట్ చేశారు శేఖర్ మాస్టర్. ఆల్రెడీ రిలీజైన ‘కళావతి’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సాంగ్ తో మాస్ బీట్ ని టచ్ చేయనున్నారు.