మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ శంకర్ డైరెక్షన్లో చేస్తున్నట్లు తెలిసిందే! ప్రస్తుతం ఈ మూవీ RC 15 అనే వర్కింగ్ టైటిల్‌తో నడుస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్ తో జతకట్టనుంది. ఇంకా శ్రీకాంత్, సునీల్, అంజలి కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ ని అందిస్తున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి గతంలో అనేకసార్లు లీకుల బెడద తప్పలేదు. ఇక ఈ సారి కూడా అదే రిపీట్ అయింది. వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర నడిరొడ్డుపై రాం చరణ్ వీరంగం సృష్టించాడు. పక్కనే ఉన్న బోర్డ్స్ లాగి పడేసి ట్రాఫిక్ పోలీస్ ముందే నానా హంగామా చేశాడు.
అయితే ఈ సీన్ లో చరణ్ పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. రెడ్ టీ షర్ట్, బ్లాక్ జాకెట్ ధరించి ఎంతో స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ లీక్ద్ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.