శనీశ్వరుడు ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశించినా… పూర్తి లాభాలనో… నష్టాలనో ఇచ్చి కానీ వెనుదిరగడు. ఒకానొక దశలో ఈయన అన్నీ మంచి ఫలితాలనే అందించినా, మరో దశలో మాత్రం అన్నీ చెడు ఫలితాలనే అందిస్తుంటాడు. ఇక శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్నప్పుడు చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాడు. అలాంటప్పుడు కేవలం శనీశ్వరుడినే ప్రార్ధిస్తూ… కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
- శని ప్రభావం అధికంగా గల వ్యక్తులు నిత్యం శివుడిని పూజించాలి. అందుకోసం శివలింగాన్ని నీటితో అభిషికించి, నల్ల నువ్వుల నైవేద్యంగా సమర్పించాలి.
- మీ శక్తి మేర పేదలకు దానం చేయండి. నిరుపేదలకు సహాయం చేయండి. నిస్సహాయులను వేదించకండి.
- కుక్కలకు రొట్టెలను ఆహారంగా ఇవ్వండి. నల్లకుక్కకు రోటీలో ఆవనూనె కలిపి ఆహారంగా ఇవ్వండి.
- శనివారం నాడు… ఒక పాత్రలో ఆవ నూనె పోసి… అందులో మీ ప్రతిబింబాన్ని చూసి… అనంతరం ఆ నూనెను దానం చేయాలి.
- శనివారం రోజు సంధ్యవేళ రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించండి. అలాగే శనీశ్వరుడికి, హనుమంతుడికి కూడా దీపం దీపం వెలిగించండి.
- క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే, శని చాలీసా, శని మంత్రాలను కూడా జపించండి.
- శనికి కోపం తెప్పించే పనులు ఎప్పుడూచేయకండి. కర్మలను సక్రమంగా నిర్వహించండి.
శని తిరోగమనంలో ఉన్నప్పుడు శని ప్రభావం అధికంగా gala రాశివారు పై జాగ్రత్తలు తీసుకొంటే, శని వారిని బాధ పెట్టడు.