మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ కడువా. ఇందులో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వస్తున్న ఈ సినిమా జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలో శనివారం కడువ టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.
‘ఆయనొక చిరుత… వేట కోసం కాచుకున్న చిరుత’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ లో పృథ్వీరాజ్ ఇచ్చిన మాస్ ఎంట్రీ అదిరి పోయింది. ఇక వివేక్ ఒబెరాయ్ అయితే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించి మెప్పించారు.
ఇక ఈ టీజర్ విషయానికొస్తే, పృథ్వీరాజ్ యాక్షన్, మాస్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అదిరిపోయాయి. విజువల్ గ్రాఫిక్స్ అన్నీ రిచ్ అండ్ లావిష్ గా వున్నాయి. చివర్లో పృథ్వీరాజ్ పులిలా గర్జించడం మాస్ ని మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.