దూరాన్ని తెలిపే రాళ్ళని మైళ్ళు రాళ్ళు అంటాం. మనం రోడ్డుమీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల మైలు రాళ్లను చూసి ఉంటాం. దాని మీద ఊరి పేరు, లేదా గ్రామం పేరు; కిలోమీటర్లు రాసి ఉంటుంది. ఇక్కడి వరకూ ప్రతి మైలురాయి మీదా కామన్ గానే ఉంటుంది.
సాదారణంగా ఏ మైలురాయి అయినా రెండు రంగుల్లో ఉంటుంది. కింద భాగం మొత్తం తెలుపు రంగులో ఉండి… పై భాగం మాత్రం వివిధ రంగులు కలిగి ఉంటుంది. ఇలా మైలు రాళ్ళకు వివిధ రంగులు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా!
నిజానికి ఈ మైలు రాళ్ళలో ఒక్కో రంగు మైలు రాయి ఒక్కో ఆర్దాన్ని సూచిస్తుంది. వైట్ కలర్ అనేది అన్ని మైల్ స్టోన్స్‌కి కామన్‌గా ఉంటుంది. కానీ, దానికి కాంబినేషన్‌గా వచ్చే కలర్ మాత్రమే మారుతుంటుంది. ఆ కలర్ ని బట్టి అది విలేజ్/టౌన్/స్టేట్/కంట్రీ లలో దేనికి సంబందించింది అనేది లెక్క కట్టవచ్చు.
- నేషనల్ హైవే: తెలుపు, మరియు, పసుపు రంగు మైలురాయి.
- స్టేట్ హైవే: తెలుపు, మరియు ఆకుపచ్చ రంగు మైలురాయి.
- టౌన్/డిస్ట్రిక్ట్ రోడ్: తెలుపు, మరియు నీలం/నలుపు రంగు మైలురాయి.
- విలేజ్ రోడ్: తెలుపు, మరియు ఎరుపు రంగు మైలురాయి.
ఈ ప్రకారం చూస్తే, మీరు ఉన్న ప్రదేశంలో వైట్, అండ్ ఎల్లో కలర్ మైల్ స్టోన్ ఉన్నట్లయితే, మీరు నేషనల్ హైవే మీద ఉన్నారని అర్థం. అదే, వైట్, అండ్ గ్రీన్ కలర్ మైల్ స్టోన్ ఉన్నట్లయితే, మీరు స్టేట్ హైవే మీద ఉన్నారని అర్ధం. ఇక వైట్, అండ్ బ్లాక్, ఆర్ బ్లూ కలర్ మైల్ స్టోన్ ఉన్నట్లయితే, మీరు సిటీ, లేదా డిస్ట్రిక్‌లోకి ఎంటర్ అయ్యారని అర్థం. అలాకాక, వైట్, అండ్ రెడ్ కలర్ మైల్ స్టోన్ ఉన్నట్లయితే, మీరు రూరల్ రోడ్డు గుండా ట్రావెల్ చేస్తున్నారని అర్థం. ఇవి రహదారుల వెంట ఉండే మైలు రాళ్ళ రంగుల అర్థం.