కృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజైన ఈ రోజుని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. భక్తులంతా ఈ రోజు భజనలు చేస్తూ… గీతాలు ఆలపిస్తూ… శ్రీకృష్ణుడిని కీర్తిస్తారు. కృష్ణుని ఆలయాలన్నీ ఈ రోజంతా కోలాటం ఆటలతో, ఉట్టి సంబరాలతో మారుమ్రోగిపోతుంటాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విషెస్ పంపుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ఒక మైనా పక్షి “హరే కృష్ణ” నామం జపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఓ పక్షి శ్రీకృష్ణుడిని ఎంతో భక్తితో కీర్తిస్తోంది.
సాదారణంగా చిలుక, మైనా వంటి పక్షులు కొన్ని మాటలు పలుకుతాయి. అందుకే వాటిని “చిలుక పలుకులు” అంటారు. అయితే ఇప్పుడు ఓ మైనా పక్షి ‘హరే కృష్ణ, హరే కృష్ణ’ అంటూ కృష్ణ నామాన్ని చాంటింగ్ చేస్తుంది.
ఒక వ్యక్తి “హరే కృష్ణ” చాంటింగ్ చేస్తూ తన పెంపుడు పక్షి అయిన మైనాతో కూడా ‘హరి బోల్’ అంటాడు. వెంటనే ఆ మైనా అతడిని అనుకరిస్తూ… ‘హరే కృష్ణ, హరే కృష్ణ’ అని పలకడం ప్రారంభించింది. ఇదంతా ఆ వ్యక్తి తన మొబైల్ లో వీడియో తీస్తున్నాడు.
ఈ వీడియో ఒక నెల క్రితమే యూ ట్యూబ్ ఛానెల్ లో బ్రాడ్ కాస్ట్ అయింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో అనేకమంది దీనిని షేర్ చేశారు కూడా. కానీ శ్రీ కృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో, ఈ పవిత్రమైన పదాలను పఠించగల సామర్థ్యం కేవలం మనుషులకే కాదు, జంతువులకు, పక్షులకు కూడా ఉందని నిరూపించటం కోసం నెటిజన్ల ద్వారా ఈ వీడియో మళ్లీ మళ్లీ ఫార్వార్డ్ చేయబడుతోంది.