According to Your Zodiac sign Which Color Ganesh Idol should be Worshiped on Ganesh Chaturthi

గణేష్ చతుర్థి రోజున ఏ రాశి వారు ఏ రంగు వినాయకుడిని పూజించాలి?

దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థిని  పిల్లల నుండీ పెద్దల వరకూ  అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఇళ్లలో పూజించే వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ వినాయకుని ప్రతిమలు తక్కువ ఎత్తు కలిగి ఉండి… కేవలం మట్టితో మాత్రమే తయారు చేస్తారు. ఈ నేపధ్యంలో ఏ రాశివారు  ఏ రంగు గణపతి విగ్రహాన్ని పూజిస్తే, సుఖ సంపదలను ఇస్తుందో తెలుసుకుందాం.

మేష రాశి: 

ఈ రాశి వారు గులాబీ రంగు, లేదా ఎరుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చి పూజించాలి. పూజా సమయంలో లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి.

వృషభ రాశి: 

ఈ రాశి వారు లేత పసుపు రంగులో ఉండే గణపతి విగ్రహాన్ని ఇంటిలో ఏర్పాటు చేసుకోవాలి. 

మిథున రాశి:  

ఈ రాశి వారు లేత ఆకుపచ్చ రంగు గణపతి విగ్రహాన్ని ఇంటిలో ప్రతిష్టించాలి. ప్రసాదంగా మోదకాన్ని నివేదించాలి.

కర్కాటక రాశి: 

ఈ రాశి వారు తమ ఇంట్లో తెల్లటి గణపతి విగ్రహాన్ని పెట్టి పూజించాలి. నైవేద్యంగా మోతీచూర్ లడ్డూని సమర్పించాలి.

సింహ రాశి: 

ఈ రాశికి చెందిన వారు తమ ఇంటికి గంధ సింధూరం రంగులో ఉండే గణపతి విగ్రహాన్ని ఉంచి పూజించాలి.

కన్య రాశి:  

ఈ రాశి వారు ముదురు ఆకుపచ్చ గణపతి విగ్రహాన్ని తమ ఇంటిలో ఏర్పాటు చేసుకోవాలి. నారింజ రంగు లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి.

తులారాశి: 

ఈ రాశి వారు తెల్లటి గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి. నైవేద్యంగా ఉండ్రాళ్ళు సమర్పించవచ్చు.

వృశ్చిక రాశి:  

ఈ రాశి వారు తమ ఇంటికి ముదురు ఎరుపు రంగు గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. మోతీచూర్‌, లడ్డూని ప్రసాదంగా పెట్టవచ్చు.

ధనుస్సు రాశి: 

ఈ రాశి వారు పసుపు రంగులో ఉండే గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి కోలుచుకోవాలి. పసుపు పూలతో అలంకరించుకోవాలి.

మకర రాశి: 

ఈ రాశి వారు తమ ఇంటికి లేత నీలం రంగులో ఉండే గణపతి విగ్రహాన్ని తెచ్చి ఏర్పాటు చేసి పూజించాలి. నైవేద్యంగా మోదకంని సమర్పించాలి.

కుంభ రాశి: 

ఈ రాశి వారు ముదురు నీలం రంగు గణపతి విగ్రహాన్ని తమ ఇంటిలో ప్రతిష్టించి పూజించాలి.

మీన రాశి: 

ఈ రాశి వారు తమ ఇంటికి పసుపు రంగు గణపతి విగ్రహాన్ని తెచ్చి ఎర్రటి పూలతో అలంకరించి పూజించాలి. నైవేద్యంగా మోదకాన్ని సమర్పించాలి.

ముగింపు:

ఈ పర్వదినాన గణేశుని విగ్రహానికి ధూప, దీప నైవేద్యాలతో పాటు, ఆత్మ పవిత్రం చేసి, తమ కోర్కెలు తీర్చమని వినయ విధేయతలతో వేడుకోవాలి. అప్పుడే ఆయన అనుగ్రహం ప్రాప్తిస్తుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top