ఇప్పటివరకూ కేవ్ ఎక్స్ ప్లోరర్స్ ఎన్నో రకాల కేవ్స్ మీద రీసర్చ్ చేసి ఉంటారు కానీ, ఇలాంటి కేవ్స్ ని ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే, ఏదో కొత్తది కనిపెట్టాలి… అది ప్రపంచానికి చూపించాలి… అని తహతహలాడేవారికి జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది. రీసర్చ్ కోసం లోపలి వెళ్లిన వాళ్లకి అక్కడ ఉన్న దృశ్యాలు చూసి చెమటలు పట్టేశాయి. కాసేపటికే హడావుడిగా పైకి వచ్చేశారు. ఇంకా అక్కడ జరిగింది చూసి అంతా షాక్ అయ్యారు. కారణం అది నరకానికి దారి తీస్తుంది.
మధ్య ఆసియాలోని ఒమన్ దేశ సరిహద్దుల్లో ఓ భారీ గొయ్యి ఉంటుంది. అక్కడి స్థానికులు దాన్ని ‘నరకపు నుయ్యి’ (Well of Hell) అని పిలుస్తారు. ఇది కొత్తగా ఏర్పడింది కాదు, కొన్ని లక్షల సంవత్సరాల నాటిది. ఇది ఎలా ఏర్పడిందో ఆధారాలు లేవు. 98 అడుగుల లోతు… 100 అడుగుల వెడల్పు కలిగిన భారీ నుయ్యి లాంటి గొయ్యి ఇది. పొరపాటున ఆ గొయ్యిలో ఎవరైనా పడితే… చనిపోవడం ఖాయం. అంత లోతుగా ఉంటుంది. అలాగని దాన్ని ఎవరూ మూసివేయలేదు. ఓపెన్‌గానే ఉంచారు. ఎందుకంటే దాన్ని చూసేందుకు టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే, ఇది టూరిస్ట్ స్పాట్.
ఇదిలాఉంటే… జియాలజిస్ట్ అయిన మహ్మద్ అల్ కిండీ తన టీమ్ తో కలిసి ఈ గుహని రీసర్చ్ చేయడానికి వెళ్ళారు. కొంతదూరం అలా లోపలికి వెళ్ళారో… లేదో… వారికో ఓ ప్రత్యేకమైన దారి కనిపించింది. ఆ దారిలో ప్రయాణిస్తూ… ఇంకా ఇంకా లోపలికి వెళ్లారు. అక్కడ వారికి భయంకర రీతిలో భారీ పాముల పుట్ట కనిపించింది. అది భూమికి సుమారు 400 అడుగుల లోతులో ఉంది. దాన్ని చూడగానే వారికి అక్కడి నివసించేవారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. “ఇది నరకానికి దారి. చనిపోయిన వారికి ఇక్కడ శిక్షలు పడతాయి. అలాగే, ఈ గొయ్యి లోపలికి వెళ్లిన వారి తలలు తెగిపడతాయి అని”.
అది గుర్తొచ్చి ఒక్కసారిగా వీరి ఒళ్ళు గగుర్పొడిచింది. పాముల పుట్ట మాత్రమే కాదు. లోపల జలపాతం, ఇంకా ఆ జలపాతం దగ్గర ఆకుపచ్చ ముత్యాలు కూడా కనిపించాయి. జలపాతం ఉన్న ప్రదేశం చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఆ జలపాతం నుండీ వచ్చే నీరు… అక్కడ ఉండే కాల్షియం కార్బొనేట్ మీద పడి… కొన్ని వేల సంవత్సరాల తర్వాత అవి ముత్యాల్లా రూపాంతరం చెందుతున్నాయి. వాటిపై లైటింగ్ పడినప్పుడు అవి మెరుస్తున్నాయి. ఇవన్నీ కేవలం ఫోటోలు, వీడియోలు తీశారు కానీ, దీనినీ టచ్ చేసే సాహసం చేయలేదు.
టీమ్ మొత్తం 6 గంటలపాటు లోపలే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత కొన్ని మట్టి శాంపిళ్లను తీసుకొచ్చి… వాటిని ల్యాబ్‌లో టెస్ట్ చేశారు. అందులో తేలింది ఏంటంటే… ఆ గుహ లోపల ఆక్సిజన్ బానే ఉందనీ… అక్కడి గాలిలో ఎలాంటి విష వాయువులూ లేవని తేలింది. కాకపోతే, ఇది నిజంగానే నరకానికి దారి చూపుతుందా..? కాదా..? అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.