సాదారణంగా దోమ కుట్టింది అంటే… దానిని చంపే దాకా వదిలిపెట్టం. అలాంటిది ఈ దోమ ఒక వ్యక్తిని కుట్టటానికి పడే కష్టం చూస్తుంటే… పగవాళ్ళకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనిపిస్తుంది.
సాయంత్రం అయ్యిందంటే చాలు… ఏది లేటైనా దోమల దాడి మాత్రం లేటవ్వదు. వాటికి భయపడి మనమేమో రకరకాల రెపెల్లెంట్లు వాడుతూ ఉంటాం. అనారోగ్యాన్ని కొనితెచ్చి పెట్టుకుంటాం. కానీ, అవి మాత్రం యధావిధిగా తాము చేయాల్సిన పని ముగించుకొనే వెళతాయి.
నిజానికి ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తం తాగుతాయంటారు. ఎందుకంటే, మనుషుల రక్తంలో ఉండే ప్రోటీన్స్… అవి పెట్టే గుడ్లు పెరగడానికి దోహదపడతాయి. రీసెంట్ గా ఓ దోమ కూడా మనిషి రక్తం తాగేందుకు విఫలయత్నం చేసింది. కానీ, చివరికి దాని దుస్థితి చూసి జాలేసింది.
రక్తం తాగుదామని ఒక వ్యక్తి చేతిపై వాలిన దోమ… దాని నోటికి ఉండే సూది లాంటిది భాగమైన ‘ప్రోబోసిస్’ ని చర్మంలోకి దింపింది. అయితే, రక్తాన్ని పీల్చే క్రమంలో ఆ సూది వంగిపోయింది. ఎంతకీ అది చర్మంలో దూరట్లేదు. దాంతో ప్రోబోసిస్ వంకరని తీసి… నిలువుగా చేసి… మళ్ళీ ఆ దోమ ప్రయత్నించింది. అయినా లాభం లేకపోయింది. మళ్ళీ మళ్ళీ అది వంకరు పోతుంది. దోమ మాత్రం ఓర్పుతో మళ్ళీ మళ్ళీ దానిని సరిచేసుకుంటుంది. ఫలితం శూన్యం. ఈసారి వేర్వేరు ప్రాంతాల్లో ప్రయత్నించింది. అయినా అది వంగిపోతూనే ఉంది. ఇక ఆ దోమ ఓర్పు చచ్చిపోయింది. ఇదంతా వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆ వ్యక్తి. ఇప్పుడా ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. దోమ కష్టానికి నెటిజన్లు కన్నీరు కారుస్తున్నారు.
Erectile Dysfunction?
Trust https://t.co/NZ7QI1PwKt 😂😇 pic.twitter.com/6laS6BzW1g— Dr. Ajayita (@DoctorAjayita) October 1, 2021