చేతివాటం చూపించటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు పక్కా ప్లాన్ తో వెళితే… ఇంకొందరు అలా వచ్చి, ఇలా దోచేస్తారు. మరికొందరు ఊహించని విధంగా దొరికి పోతారు. ఎలా వెళ్ళినప్పటికీ చోరీ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఈ కోవలోకి చెందిందే ఈ వీడియో కూడా. ఓ జ్యూవెలరీ షాప్‌లో ఉన్న CCTV ఫుటేజ్ లో క్యాప్చర్ చేయబడిన వీడియో ఇది.
ఇందులో ఒక జంట వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సింగ్‌తో జ్యూవెలరీ షాపులోకి ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన వాళ్ళంతా వీళ్ళు ఎంత బంగారం కొంటారో అనుకొంటారు. ఎందుకంటే, వాళ్ళు దొంగల్లా కాకుండా… సెలబ్రిటీస్ లా ఫోజ్ కొట్టారు మరి. గోల్డ్ కొంటునట్లు నటిస్తూ, వారిద్దరూ కలిసి కొంతసేపు షాప్ ఓనర్ని కన్ఫ్యూజ్ చేశారు. యజమాని ఎన్ని వెరైటీలు చూపించినా… తమకే మోడల్ నచ్చలేదని చెప్పడం మొదలు పెట్టారు. ఇదంతా షాప్ ఓనర్ అబ్జర్వ్ చేస్తున్నాడు. తమ షాప్ లో చోరీ జరుగబోతోందని ముందే పసిగట్టాడు.
ఇక ఆ యువతీ తన వెంట ఒక గిఫ్ట్ ప్యాక్ బాక్స్‌ని తెచ్చుకుంటుంది. దానిని టేబుల్ పై ఉంచుతుంది. దాని పక్కనే ఉన్న డిస్ప్లే జ్యూవెలరీపై వారి కన్ను పడింది. జ్యూయలరీ చూస్తున్నట్లు నటిస్తూ, ఆ గిఫ్ట్ బాక్స్ ని డిస్ప్లే జ్యూవెలరీపై పెడుతుంది. కొద్దిసేపు ఓనర్ ని మాటల్లో పెట్టి, తమకేదీ నచ్చలేదంటూ వెళుతూ, ఆ గిఫ్ట్ బాక్స్ ని అందుకుంటుంది. ఇంకేముంది… బాక్స్ తో పాటే, ఆ జ్యూయలరీ కూడా మిస్సవుతుంది. వాళ్ళు డోర్ దగ్గరికి వెళ్ళగానే షాప్ ఓనర్ ఏం చేశాడో మీరే చూడండి. దేశ వ్యాప్తంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓనర్ చేసిన పనికి నెటిజన్లు తెగ అభినందిస్తున్నారు.
View this post on Instagram