సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే టూరిస్ట్ ప్లేస్ లకి వచ్చినప్పుడు సెల్ఫీలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వారి మాటలని పెడచెవిన పెట్టి జనాలు వాళ్ళు చెయ్యాల్సింది చేస్తున్నారు. ఎంతో సంతోషంగా గడపాల్సిన టూర్లు కాస్తా విషాదంగా ముగుస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించటానికి వచ్చి… అదే ప్రకృతికి బలి పోతున్నారు.
ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్లి… 6గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరువనే లేదు. ఇంతలో మరో యువకుడు ఫోటోలకు ఫోజులిచ్చి బలయ్యాడు. అందమైన జలపాతం పక్కనే ఫోటో దిగాలనుకున్న యువకుడు కాలుజారి అదే జలపాతంలో పడి గల్లంతయ్యాడు. తమిళనాడులోని కొడైకెనాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల అజయ్ పాండియన్ తన స్నేహితులతో కలిసి కొడైకెనాల్లోని “దిండుగల్ వాటర్ ఫాల్స్” ని చూసేందుకు వెళ్లాడు. వెళ్ళినవాడు ఊరుకోకుండా ఆ వాటర్ ఫాల్స్ కి దగ్గరిగా నిలబడి క్లోజప్ లో సెల్ఫీ దిగాలని ఆశపడ్డాడు. అక్కడ ఉన్న రాళ్లపై నిలబడి ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. అతని స్నేహితుడు ఫోటోస్ తీస్తున్నాడు. అయితే ఆ కుర్రాడు అక్కడితో ఆగకుండా మరింత కిందకి దిగటం మొదలుపెట్టాడు. తన స్నేహితుడు మాత్రం జాగ్రత్తరా! వద్దురా! అని కేకలు పెడుతున్నప్పటికీ వినిపించుకోకుండా అతను కిందకి దిగేశాడు.
ఇక నువ్వు సెల్ఫీ లాగించేయ్ అంటూ థమ్సప్ సింబల్ చూపించాడు. వెంటనే వెనక్కి తిరిగాడు అంతే… ఆ కాలుజారి ఆ జలపాతంలో పడిపోయాడు. అతని ఫ్రెండ్ ఫోన్ లో ఈ సంఘటన మొత్తం రికార్డ్ అయ్యింది. ఎంత వెతికినప్పటికీ ఫ్రెండ్స్ ఎంత వెతికినప్పటికీ ఆయన ఆచూకీ లబించలేదు. రెస్క్యూ సిబ్బంది ఆ స్థలంలో ఎంతగా గాలింపు చేపట్టినప్పటికీ గల్లంతైన యువకుడి ఆచూకీ మాత్రం లభించలేదు.