ఇటీవలి కాలంలో మార్స్ పై వింత వింత ఆకారాలని క్యాప్చర్ చేస్తుంది నాసా. అందులో భాగంగానే రీసెంట్ గా మార్టిన్ ఉపరితలంపై 4 కిలోమీటర్ల పొడవు గల గోడలా కనిపించే భారీ నిర్మాణాన్ని కనుగొన్నారు.
ఈ నిర్మాణం అంగారక గ్రహంపై ఇంతకు ముందు కనిపించిన వాటికంటే భిన్నంగా ఉంది. బహుశా ఇది కాలక్రమేణా కోతకు గురైన పర్వతాలు లేదా శిఖరాల కారణంగా ఏర్పడినవా అంటే… ఇది గ్రహం యొక్క సహజ లక్షణాలతో సరిపోలడం లేదు. విచిత్రంగా దీనిని ఎవరో నిర్మించినట్లు కృత్రిమంగా అనిపిస్తుంది.
మరో విచిత్రం ఏంటంటే, ఇది కాంతిని ప్రతిబింప చేస్తుంది. భూమిపై ప్రకాశవంతమైన ఛాయను సృష్టిస్తుంది. అదికూడా అక్కడి భూభాగం కంటే భిన్నంగా ఏదో మెరిసే పదార్థంతో తయారు చేయబడింది.
ఒకవేళ ఇది ఒకప్పుడు అంగారక గ్రహంపై నివసించిన నాగరికతచే నిర్మించబడిన పురాతన గోడ యొక్క అవశేషమా! అని సందేహం కలుగుతుంది. అలా అయితే అంగారక గ్రహానికి ఏదో జరిగి…అది శత్రు ప్రపంచంగా మారిందని అనుకోవటానికి ఇది క్లూ కావచ్చు.
ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరకటం అంత సులభం కాదు. మార్స్ పై ఒకప్పుడు జీవం ఉందనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు, అయినప్పటికీ, కొన్ని సవాళ్లు విసిరే ఎనామలీస్ అంగారకుడిపై ఉన్నాయి. ఉదాహరణకు, కృత్రిమంగా కనిపించే పిరమిడ్లు, గొట్టాలు మరియు ఇతర నిర్మాణాలు వంటివి.
చివరిమాట:
ఏదేమైనా మార్స్ పై వాతావరణం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఈ గోడ యొక్క ఉనికి కొంత కాలానికి ఉండచ్చు, ఉండక పోవచ్చు.