ఓ యువతిని కొంత మంది కుర్రాళ్లు కలిసి నడిరోడ్డుపై వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోపై దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఉన్న ఇటార్‌ఖేడి ప్రాంతం చాలా నిర్మానుష్య ప్రాంతం. తరచుగా అక్కడికి ప్రేమ జంటలు వస్తుంటాయి. అలాగే, ఓ ప్రేమ జంట కూడా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామని ఆ ఏరియాకి వెళ్ళింది. ఇంతలో ఒక గుంపు వారు ప్రయాణిస్తున్న స్కూటీని అడ్డుకొంది.
మొదట స్కూటీ నడుపుతున్న కుర్రాణ్ని, తర్వాత వెనుక కూర్చున్న అమ్మాయిని విడివిడిగా పేర్లు అడిగారు. ఆ తర్వాత వారిద్దరి మతాలూ అడిగారు. ఇద్దరివీ వేర్వేరు మతాలని తెలియటంతో… ఆమెని తిట్టడమే కాకుండా… ఆమె వేసుకున్న బుర్ఖా విప్పేయాలని బలవంతం చేశారు.
ఇదంతా ఎవరైనా చూస్తే పరువు పోతుందన్న ఉద్దేశ్యంతో… ఆ యువకుడు వారిని వారించి… తన ప్రేయసి చేత బలవంతంగా బుర్ఖా తీసివేయించాడు. అయినా ఊరుకోక బుర్ఖా మాత్రమే కాదు, ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ కూడా తీసేయాలని పట్టుపట్టారు. దీంతో ఆ యువతి తీవ్ర ఉద్వేగానికి గురయ్యింది. అది చూసి చలించిపోయిన ఆ యువకుడు… యువతిని కౌగలించుకొని ధైర్యం చెప్పి… వారికి ఎలాగోలా నచ్చచెప్పి… వెంటనే ఆమెని స్కూటీ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు.
ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. రాజ్యాంగం ప్రకారం మనదేశంలో వ్యక్తి స్వేచ్చని హరించే హక్కు ఎవరికీ లేదని… అలాంటిది వారు ఆమె స్వేచ్చని హరించారని… అసలు ముస్లిం మతాచారం ప్రకారం బుర్ఖా విప్పమని చెప్పటం అతి పెద్ద నేరమని… దీనికి శిక్ష తప్పదని… అందుకే దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
भोपाल के इस्लाम नगर में एक लड़की को धर्म के ठेकेदारों ने बुर्का उतारने के लिए मजबूर किया क्योंकि उन लोगों को शक था कि जिस लड़के की स्कूटी पर वह पीछे बैठी थी, वह हिंदू था. इस घटना का एक वीडियो वायरल हो रहा है!!
ये कैसा सेकलुरिज्म ? pic.twitter.com/S0z7OQcfOQ
— Piyush Tiwari (@PiyushTiwariNew) October 17, 2021