మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో సర్వసాదారణమై పోయింది. చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ తెగ వాడేస్తున్నారు. లేచింది మొదలు, పడుకునే వరకూ చేసే ప్రతి యాక్టివిటీ మొబైల్ తోనే. అంతలా మనల్ని తన బానిసలుగా మార్చుకుంది ఈ మొబైల్. కాదు, కాదు మనమే బానిసలై పోయాం.
“జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు… క్యారెక్టర్ కోల్పోకూడదు” అనేది ఒకప్పటి మాట. కానీ, “జీవితంలో ఏది మిస్సయినా పరవాలేదు… మొబైల్ మిస్సవకూడదు” అనేది ఇప్పటి మాట. అంతలా సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిపొయింది ప్రపంచమంతా.
అయితే, మొబైల్ కి మనుషులే కాదు, మేము కూడా ఎడిక్ట్ అయిపోయాం అంటుంది ఓ వానరం. ఈ వీడియోలో ఓ కోతి పగలంతా కష్టపడి కోతి పనులన్నీ చేసింది. ఇక రాత్రి కునుకు తీద్దాం అనుకుంది. తన యజమాని దానికి తన పక్కనే బెడ్ కూడా రెడీ చేసింది.
తీరా పడుకుందాం అనుకుంటుండగా… ఇంతలో దానికి మొబైల్ కనిపించింది. ఇంకేముంది… ప్రాణం లేచొచ్చినట్లు అయింది. వెంటనే ఫోన్ ఆపరేట్ చేయటం మొదలు పెట్టింది. ఒకపక్క నిద్ర ముంచుకొస్తున్నా… కళ్ళు నలుపుకుంటూ… రెండో చేత్తో టైమ్ పాస్ కి స్నాక్స్ తింటూ… సీరియస్ గా ఫోన్ ఆపరేట్ చేస్తుంది. దానిపక్కనే ఉన్న యజమానికి కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇక పడుకుందాం రా..! అంటూ సైగ చేస్తూ… దాని కాలు గీకింది. అయినా పట్టించుకోకుండా… బిజీ బిజీగా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంది. ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
First documented case of transfer of a disease from humans to animals. pic.twitter.com/FL1mtG2h1I
— Kaptan Hindustan™ (@KaptanHindostan) October 27, 2021