‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. బేబమ్మ పాత్రలో తన అద్భుత నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. తొలి సినిమాతోనే ఊహించని సక్సెస్ అందుకుని… ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.
ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ వంటి మూవీస్ లో డేరింగ్ రోల్ చేసినా రియల్ లైఫ్ లో మాత్రం చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవాలి. అందుకు నిదర్శనమే ఈ లైవ్ ఇంటర్వ్యూ.
రీసెంట్ గా కృతిశెట్టి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ని అందుకుంది. ఆ తర్వాత ఓ మీడియా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరు యాంకర్లు ఆమెని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారు. ఇంతలో ఒక యాంకర్ కృతిని వరుసగా ప్రశ్నలు అడుగుతుంటే… అక్కడున్న మరో వ్యక్తి చాలా సీరియస్ అవుతాడు. దీంతో కృతిశెట్టి ఒక్కసారిగా షాక్‌కి గురై… లైవ్ లోనే ఏడ్చేస్తుంది.
అప్పుడు అక్కడున్న టీమ్ మొత్తం కృతి వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చారు. ఇదంతా ప్రాంక్ మాత్రమేనని, కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు. కొద్దిసేపటికి తేరుకున్న తర్వాత ‘ఎవరైనా ఇలా గట్టిగా మాట్లాడితే నాకెంతో భయం’ అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.