నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి ఈ చిత్రంలో బాలయ్యని చాలా వైవిధ్య భరితమైన పాత్రలో చూపించబోతున్నారు. అందుకే బాలయ్య అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్, వీడియోలకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా దీపావళి రోజు విడుదలైన టైటిల్ సాంగ్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను ఇప్పుడు విడుదల చేశారు.
‘ఖం ఖం ఖంగుమంది శంఖం’ అనే లిరిక్స్‌తో సాగిపోయే ఈ పాటని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రచించారు. శంకర్ మహదేవన్, శివమ్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్ ఎంతో అద్భుతంగా ఆలపించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటలో బాలయ్య వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యాజైస్వాల్ నటిస్తోంది. ఇక శ్రీకాంత్, పూర్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.