కొన్ని కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటే… ఏ క్షణం ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠతో ప్రాణాలు అరచేత పట్టుకొని చూస్తుంటాం. ఒక్క సెకను రెప్ప వాల్చినా… ఏది మిస్సవుతామో అనిపిచ్చేలా ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అలాంటిదే! చూస్తున్నంతసేపూ ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
అమెరికాలోని ఉటాహ్ లో ఉన్న సబర్బన్ సాల్ట్ లేక్ సిటీలో రెప్టైల్ పార్క్ ఒకటి ఉంది. అందులో స్కేల్స్ అండ్ టైల్స్ అనే విభాగం ఉంది. ఆ సెక్షన్ లో ఎలిగేటర్స్ ఎన్‌క్లోజర్స్ ఉన్నాయి. రోజూలాగే ఆ రోజు కూడా చాలా మంది విజిటర్స్ వాటిని చూసేందుకు వచ్చారు. వారలా చూస్తుండగానే … సడెన్ గా ఎలిగేటర్ ముందుకువచ్చి… ట్రైనర్ చేతిని పట్టుకుని లాగింది. ఆమె ఎంత గింజుకున్నా… చేతిని నోట కరచుకొని… వదిలిపెట్టలేదు. దీంతో… అక్కడున్న వారంతా కేకలు వేయసాగారు.
అది చూసిన ఓ వ్యక్తి హీరోలా ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. ఆ మొసలిపై పడి… దాని రెండు దవడలని బలవంతంగా వేరు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఆ ఎలిగేటర్ తన నోట్లోని చెయ్యిని వదలకుండా అంతే పట్టుకొని ఉంది. అయినా అతను ఎలాగైనా విడిపించాలని గట్టిగానే ప్రయత్నించాడు.
ఇంతలో జూ సిబ్బంది వచ్చి… ఆమెని ఒక్కసారిగా పైకి లాగేశారు. అప్పుడు ఆమె చేతిని ఎలిగేటర్ వదిలిపెట్టింది. దీంతో ఆమె బతికిపోయింది. మరి అతని సంగతేంటి?
ఇక అతను ఎలిగేటర్ పైన కూర్చొని ఉన్నాడు. అదేమో మంచి ఆకలి మీద ఉంది. ఎలాగైనా అతన్ని తినాలనే ఆరాటంతో ఉంది. తోకతో నీళ్ళని అటూ ఇటూ కొడుతూ ఎలాగైనా అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ, అతనేమీ తక్కువ కాదు, చాలాసేపు ప్రయత్నించి ఎలాగోలా దాని బారినుండీ బయటపడతాడు.
గాయపడిన ట్రైనర్ ని ఆస్పత్రికి తరలిచారు. తనను కాపాడినందుకు ఆ వ్యక్తికి ఆమె కృతజ్ఞతలు తెలియచేసుకుంది.