ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూటే సపరేటు. ఆన్ స్క్రీన్ లో తన డాన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంటే… ఆఫ్ స్క్రీన్ లో తన గారాల పట్టి క్యూట్ స్టెప్స్ తో నెటిజన్లని ఫిదా చేస్తుంటుంది.
అల్లు అర్జున్ మొదటినుంచీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటారు. ఈ నేపధ్యంలో సినిమలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన ఫ్యామిలీకి సంబందించిన విషయాలు కూడా షేర్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన గారాలపట్టి అల్లు అర్హకి సంబంధించిన వీడియోలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.
ఇక లిటిల్ కిడ్ అల్లు అర్హ అంటే చాలామందికి విపరీతమైన ఇష్టం. తన ముద్దు ముద్దు మాటలతో, చిలిపి పనులతో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.
అయితే, తాజాగా అర్జ ఓ పాటకి క్యూట్ గా డ్యాన్స్ చేసింది. అది అలాంటి ఇలాంటి సాంగ్ కాదు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ‘కచ్చా బాదాం’ సాంగ్. ఈ వీడియోని తన ఇన్స్టా ఎకౌంట్ ద్వారా షేర్ చేస్తూ… ‘మై లిల్ బాదాం అర్హా’ అంటూ క్యూట్ కాప్షన్ కూడా యాడ్ చేశారు అల్లు అర్జున్.
View this post on Instagram