ఈమధ్య కాలంలో షార్ట్ వీడియోస్ కి పాపులారిటీ పెరగటంతో… ప్రతి ఒక్కరూ ఏదో ఒక విచిత్రమైన పని చేయడం, దానిని మొబైల్ ఫోన్లో బంధించడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫ్యాషన్ అయిపొయింది.
అందులో భాగంగానే జంతువులు చేసే ఫీట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. హైప్ క్రియేట్ చేయడంలో తగ్గేదే లేదంటున్నాయి గజరాజులు. ఈ వీడియోలో ఒక వ్యక్తికి బాస్కెట్ బాల్ గోల్ వేయడంలో గజరాజు చేసిన హెల్ప్ చూస్తే… చాలా ఫన్నీగా అనిపిస్తుంది.
వివరాల్లోకి వెళ్తే… జోనా అనే ఇన్‌స్టాగ్రామర్ షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి బాస్కెట్ బాల్ పట్టుకొని… ఒక ప్లాంక్‌పై నిలబడి ఉంటాడు. ఇంతలో రెనే కాస్సెల్లీ అనే పిల్ల ఏనుగు అతనికి ఎదురుగా వచ్చి… ఆ ప్లాంక్‌పై అడుగుపెడుతుంది. వెంటనే ఒక ఫ్లిప్ చేసి బాస్కెట్‌బాల్ తో సహా అతను పైకెగిరి… బాల్ ని గోల్ వేయబోతాడు. కానీ, జస్ట్ మిస్సవుతాడు. బాల్ మిస్సయినప్పటికీ… ఈ వీడియో మాత్రం చూడడానికి చాలా ఫన్నీగా ఉంది.
View this post on Instagram