రాను రాను దేవునిపై భక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో… తానున్నానంటూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియచేస్తున్నాడు భగవంతుడు. మొన్నటికి మొన్న ‘అసని’ తుఫాను దాటికి శ్రీకాకుళం సముద్రపు ఒడ్డుకి ఒక బంగారు రథం కొట్టుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే! కానీ, అది ఎక్కడినుంచీ వచ్చిందో… ఎలా వచ్చిందో… ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పుడు రీసెంట్ గా కృష్ణా నది ఒడ్డుకి దేవతా విగ్రహాలు కొట్టుకు వచ్చాయి.
సాదారణంగా ఇసుక, చిన్న చిన్న రాళ్ల వంటివి నదీ ప్రవాహానికి కొట్టుకురావటం సహజం. కానీ ఇక్కడ కొట్టుకువచ్చింది పెద్ద పెద్ద విగ్రహాలు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో… ఎలా వచ్చాయో… ఎవ్వరికీ తెలియదు. ఉన్నట్టుండి ఆ విగ్రహాలు నదీ ఒడ్డున దర్శనమిచ్చాయి.
ఆత్మకూరు మండలం జూరాల సమీపంలో ఉన్న కృష్ణా నది ఒడ్డున సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బయటపడ్డాయి. ఇవన్నీ నదీ ప్రవాహానికి కొట్టుకు వచ్చినట్లు అర్ధమవుతుంది. విచిత్రం ఏంటంటే, ఈ సీతారామ లక్ష్మణుల విగ్రహాల దగ్గరకే సపరేట్ గా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కొట్టుకు వచ్చింది. అంతేకాదు, ఈ విగ్రహాలకి ఆభరణాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవి అత్యంత పురాతనమైనవి కూడా. ప్రస్తుతం ఈ విగ్రహాలని పురావస్తు పరిశోధనా శాఖ పరిశీలిస్తుంది.