ఇండియన్ హిస్టరీలో అశోకుడ్ని గ్రేట్ రూలర్ గా, పాసిఫిస్ట్ గా చెప్తుంటారు. ఇదంతా కాయిన్ కి వన్ సైడ్ మాత్రమే! అదర్ సైడ్ చూస్తే, అతనో క్రూయల్ రూలర్. నిజానికి అశోకుడు రాజ్యం కోసం తోడపుట్టిన వాళ్ళనే చంపేసిన క్రూరుడు. యుద్ధ దాహంతో లక్షలాది మందిని పొట్టన పెట్టుకొన్న రాక్షసుడు. కానీ, ఆ తర్వాత ప్రజల కోసం సేవ చేసి ఉదారుడిగా మారాడు. ధర్మ స్థాపన కోసం బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసి అందరి దృష్టిలో దేవుడయ్యాడు. ఈ నేపధ్యంలో “అశోక ది గ్రేట్” అని అంతా అంటే… కాదు “అశోక నాట్ సో గ్రేట్” అని కొందరు వాదిస్తారు. అందుకు దారితీసిన కారణాలు ఏంటో ఈ రోజు చెప్పుకుందాం.
అశోకుడు ఎవరు?
అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుని మనవడు. అంటే రెండవ మౌర్య చక్రవర్తి బిందుసార కుమారుడు. ఈయన క్రీస్తు పూర్వం 304 లో బిందుసారుడు మరియు సుభద్రాంగి దంపతులకు పాటలీపుత్రలో జన్మించాడు.
“అశోక” అంటే సంస్కృతంలో “అ” అంటే – లేని; “శోక” అంటే – బాధ. టోటల్ గా “అశోక” అంటే – నొప్పిలేకుండా లేదా బాధ లేకుండా ఉండటం అని అర్ధం. అశోకుని తల్లి అతనికి ఈపేరు పెట్టింది,
అశోకుడు తన తల్లి అలాగే గురువు యొక్క గైడెన్స్ లో విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీతో సహా యుద్ధ నైపుణ్యం, మరియు తత్వశాస్త్రంలో శిక్షణ పొందాడు. ఎంతోమంది సిబ్లింగ్స్ ఉన్నప్పటికీ, అశోకుడు సింహాసనాన్ని అధిరోహించడం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన శకానికి నాంది పలికింది.
అశోకుడు తన తండ్రితో పాటు తాను కూడా పోరాటాలకు వెళ్ళేవాడు. అలా యుద్ధం మరియు పాలన విషయంలో ఎంతో అనుభవాన్ని గడించాడు. ఇక వీరి సామ్రాజ్యంలో ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన చాణక్యుడు ఇతని ఎర్లీ లైఫ్ లో కీ రోల్ ప్లే చేశాడు. అతను చెప్పిన లైఫ్ లెసన్స్, మిలిటరీ క్యాంపెయిన్స్, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ తరువాత ఇతని పాలనకు పునాది వేశాయి. ఇలా తన లైఫ్ లో ఫేస్ చేసిన అనేక రకాల ఛాలెంజెస్ అండ్ ఎక్స్ పీరియన్సెస్ అశోకుడి పాలనలో ట్రాన్స్ ఫర్ మేటివ్ ఈవెంట్స్ గా నిలిచాయి.
క్రీస్తు పూర్వం 268 నుండి 232 వరకు భారతదేశాన్ని పరిపాలించిన పురాతన మౌర్య సామ్రాజ్య చక్రవర్తి ఇతను. ఇండియన్ హిస్టరీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ లో వన్ అఫ్ ది పర్సన్ ఈ అశోకుడు.
అశోకుని సామ్రాజ్యం ఎంత పెద్దది?
అశోకుడిని మొదట్లో సింహాసనానికి వారసుడిగా పరిగణించబడలేదు. ఆ గౌరవం బిందుసారుని మొదటి రాణి కుమారుడైన సుసీమా అంటే…. అశోకుని సవతి సోదరునికి దక్కింది. అయినప్పటికీ, అశోకుడు అవంతి ప్రావిన్స్‌కు సేనాధిపతిగా నియమించబడ్డాడు. అక్కడే అతను పాలనలో గొప్ప అనుభవాన్ని పొందాడు.
అశోకుని పాలనా జీవితం బిందుసారుడి సైన్యానికి సేనాధిపతిగా నియమించబడినప్పటి నుండీ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అతను బ్యాటిల్ ఫీల్డ్ లో తన క్యాపబిలిటీస్ ని ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు, ఆ కాలంలో ఉన్న గ్రేట్ జనరల్స్ లో ఒకరిగా పేరు పొందాడు.
బిందుసార మరణం తర్వాత సింహాసనం కోసం జరిగిన పోరాటంలో అశోకుడు తన అన్న సుసీమను చంపినట్లు ఆధారాలు చెబుతున్నాయి. క్రీస్తుపూర్వం 269 లో అశోకుడు సింహాసనాన్ని అధిరోహించాడు. తరువాతి 8 సంవత్సరాలలో తన సామ్రాజ్యాన్ని తూర్పున బంగ్లాదేశ్ నుండి పశ్చిమాన బలూచిస్తాన్ వరకు, అలాగే ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్నాటక వరకు విస్తరింపచేశాడు. ఇలా దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. ఒకరకంగా చెప్పాలంటే, ఇతని సామ్రాజ్యం ప్రస్తుతం ఉండే తమిళనాడు కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలు మినహా మొత్తం భారత ఉపఖండం అంతటా విస్తరించింది.
ఆ సమయంలో పాటలీపుత్ర మౌర్య సామ్రాజ్యానికి రాజధానిగా చేయబడింది. ఉజ్జయిని మరియు తక్షశిల ప్రాంతీయ రాజధానులుగా ఉన్నాయి. అశోకుని సామ్రాజ్యం ఇండియన్ కాంటినెంట్ లోనే అతిపెద్దది. ఇది అశోకుని ఆధ్వర్యంలో 5 మిలియన్ చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. అలాగే ప్రజలు కూడా ఎంతో సుఖశాంతులతో వర్ధిల్లే వారు. ఈ విధంగా అశోక చక్రవర్తి క్రీస్తుపూర్వం 268 నుండి 232 వరకు మొత్తం 37 సంవత్సరాలు పరిపాలించాడు.
అశోకుడు హింసను ఎలా వదులుకున్నాడు?
కళింగ యుద్ధం అతని పాలనలో ఓ కీలకమైన మలుపు. అలాగే అతని జీవితంలో, కళింగకు వ్యతిరేకంగా చేసిన యుద్ధమిది. క్రీస్తుపూర్వం 260 లో అశోకుడు కళింగపై భారీ యుద్ధం చేసి దానిని జయించాడు. ఈ యుద్ధంలో మొత్తం 1,00,000 మందికి పైగా మరణిస్తే…1,50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన మరియు విధ్వంసకరమైన యుద్ధం.
యుద్దానికి ముందు అంతటి రక్తపాతాన్ని, విధ్వంసాన్ని అస్సలు ఊహించలేక పోయాడు అశోకుడు. అందుకే, కళింగ యుద్ధంలో గెలిచిన తర్వాత జరిగిన ఘోరం చూసి తట్టుకోలేక పోయాడు. దీనంతటికీ కారణం తానే అని తెలిసి కుమిలి పోయాడు. రోజులు గడిచేకొద్దీ అతనిలో పశ్చాత్తాపం మరింత పెరిగింది. అందుకే, ఇకపై ఈ హింసను, రక్తపాతాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు.
హింసను విడిచిపెట్టటం కోసం అహింసా మార్గాన్ని ఎంచుకొన్నాడు. ఈ క్రమంలోనే బౌద్ధమతం అతనిని నాటకీయంగా మార్చివేసింది. బుద్ధుని బోధనలు అతని దృక్పథాన్ని పూర్తిగా మార్చాయి. అతనిప్పుడు పూర్తి భిన్నమైన వ్యక్తిగా మారాడు. ఇకపై యుద్ధాలే కాదు, మరే ఇతర ప్రాణికీ కూడా హాని చేయకూడదని భావించి జంతువుల వేట కూడా నిషేధించాడు.
ఒక పెద్ద యుద్ధంలో గెలిచిన తర్వాత కొత్త భూభాగాలను జయించాలనే కోరికను విడిచిపెట్టిన ఏకైక రాజుగా అశోకుడు మిగిలాడు. ఇదంతా అశోకుని 13వ శిలా శాసనం స్పష్టంగా వివరిస్తుంది.
అశోకుడు బౌద్ధమతాన్ని ఎలా వ్యాప్తి చేశాడు?
అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించడం అతని పాలనలో వచ్చిన అతి పెద్ద మార్పు. హింసను విడిచిపెట్టి, బౌద్ధ సూత్రాల ప్రకారం పాలన చేయటం ప్రారంభించాడు. సహనం, మత స్వేచ్ఛ మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు. అలాగే, భారతదేశం అంతటా బౌద్ధ స్థూపాలు మరియు మఠాల నిర్మాణాలని చేపట్టాడు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బుద్ధుని బోధనలను వ్యాప్తి చేయడానికి బౌద్ధ మిషనరీలను కూడా ఏర్పాటు చేశాడు.
బుద్ధుడు ప్రకటించిన ధర్మం అనేది అన్ని సమయాల్లో అందరికీ వర్తించే “అల్టిమేట్ యూనివర్శల్ ట్రూత్”. అందుకే అతని బోధనల నుండీ నుండి తీసుకున్న ప్రిన్సిపల్స్ ని స్తూపాలలో కూడా పొందుపరచాడు.
అశోకుడు ఇప్పుడు సామాన్యుల బాధలను అర్థం చేసుకొనే వ్యక్తి అయ్యాడు. బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రజలని వారి బాధల నుండి విముక్తి చేయడానికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాడు. అతను తన మంత్రులను మరియు ఇతర నిర్వాహకులను కూడా అదే విధంగా చేయమని ఆదేశించాడు. అతను తన కుమారులను కూడా అలానే చేయమని చెప్పాడు.
ఈ క్రమంలోనే ధర్మం గురించి ప్రజలకు బోధించడానికి ఇంకా సందేశాన్ని అందించడానికి “ధమ్మ మహామత్త” అని పిలువబడే అధికారులను నియమించాడు. “ధమ్మ మహామత్త” అనేది ఒక సంస్కృత పదం. దీని అర్ధం “ధర్మ ప్రముఖులు” లేదా “ధర్మ గురువులు” అని. ఇది సామాన్యంగా బౌద్ధ ధర్మంలో ఉన్న ప్రముఖ వ్యక్తులను సూచించడానికి ఉపయోగిస్తారు.
ఇక అశోకుడు తన పిల్లలైన సంఘమిత్ర మరియు మహేంద్రలను బౌద్ధమత వ్యాప్తికి శ్రీలంకకు పంపాడు. బౌద్ధమత వ్యాప్తిలో వీరు ముఖ్యపాత్ర పోషించారు. ఇక మహేంద్రని అయితే ఏకంగా బౌద్ధ మత ప్రచారకుడిగా శ్రీలంకలోని అనురాధపుర రాజ్యానికి పంపారు. ఈ విధంగా బౌద్ధమతాన్ని అంతటా వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించడం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇది భారతదేశంలో మత విస్తరణకి సహాయపడింది. ఇంకా సంస్కృతి మరియు సమాజంపై శాశ్వత ప్రభావాన్ని చూపింది.
అశోకుడిని గ్రేట్ అని ఎందుకు అంటారు?
ప్రజల కోసం జంతువుల కోసం ఆసుపత్రుల స్థాపన, బావులు త్రవ్వించడం, రోడ్డు పక్కన చెట్లు నాటించడం, నీటి షెడ్లు మరియు విశ్రాంతి గృహాల నిర్మాణం వంటి ప్రజా ప్రయోజన పనులెన్నో చేశాడు. ప్రజల అలసత్వాన్ని అరికట్టాలని, జంతువుల పట్ల క్రూరత్వాన్ని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అనేక స్థూపాలు మరియు మఠాలను నిర్మించడం ఇలా అశోకుడు ఎన్నో శాశ్వతమైన సేవలని అందిస్తూ వచ్చాడు.
ఇతను ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాడు. వన్యప్రాణుల సంరక్షణ చర్యలను సమర్థించిన మొదటి చక్రవర్తి.
అశోకుని పాలన అతను చెక్కించిన రాతి శాసనాల ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాయించుకొంది. అది మౌర్య సామ్రాజ్యంలోని అన్ని మూలల్లోని ప్రజలను చేరుకోవడానికి అతనికి హెల్ప్ అయింది. ఇలా తాను చేసిన మోడల్ పాలన కారణంగా అతను గొప్పవాడు అని పిలువబడ్డాడు.
అశోక్ ఎందుకు అంత గొప్పవాడు కాదు?
అశోకుడిని ఇండియన్ హిస్టరీలో గ్రేట్ ఎంపరర్ అండ్ పాసిఫిస్ట్ గా చెప్తుంటారు. అయితే, దీనికి లిటిల్ బిట్ అఫ్ ఎవిడెన్స్ మాత్రమే ఉంది. ఇంకొంచెం డీప్ గా రీసర్చ్ చేస్తే డిఫరెంట్ స్టోరీ కనిపిస్తుంది. సంజీవ్ సన్యాల్ రాసిన “ది ఓషన్ ఆఫ్ చూర్న్” అనే బుక్ లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలియచేశాడు.
క్రీస్తు పూర్వం 262 లో జరిగిన కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని కళ్ళారా చూసిన తర్వాత మనసు మార్చుకొని అశోకుడు బౌద్ధమతంలోకి మారాడని అంటారు. కానీ, కళింగ యుద్ధానికి 2 సంవత్సరాల ముందే అశోకుడు బౌద్ధమతంలోకి మారినట్లు తెలుస్తోంది. అశోక చక్రవర్తి గురించి అకడమిక్ హిస్టారియన్స్ ఫాల్స్ నెరేటివ్ ని ఎందుకు క్రియేట్ చేశారు? ఎందుకు ప్రోమోట్ చేశారు? అనే ప్రశ్నకి గల కొన్ని హిస్టారికల్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
చండశోక
బిందుసారుడు మరణించిన తర్వాత మౌర్య సామ్రాజ్యానికి చట్టబద్ధమైన వారసుడుగా తన పెద్ద కుమారుడైన సుషీమా యువరాజు కావాల్సి ఉంది. తండ్రి మరణవార్త విని వస్తున్న అతనిని గ్రీకు కిరాయి సైనికుల సహాయంతో రాజధాని ద్వారం వద్దే చంపాడు అశోకుడు. తర్వాత మిగిలిన 99 మంది సవతి సోదరులను కూడా చంపించి వేశాడు. అతని మరో సోదరుడు టిస్సాను మాత్రమే విడిచిపెట్టాడు. అ తర్వాత పూర్తిగా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
అంతటితో ఆగక తన పాలనని వ్యతిరేకించిన చాలా మంది ప్రజలను ఊచకోత కోశాడు. దాదాపు 500 మంది అధికారులని చంపించాడు. ఇలా సామ్రాజ్యం కోసం అశోకుడు నిరంకుశుడిగా వ్యవహరించాడు. అతని ఈ క్రూరమైన పాలనకి గాను అతనికి ‘చండశోకుడు’ అని పేరు పెట్టింది. ‘చండశోక’ అంటే క్రూరమైనవాడు అని అర్ధం.
బౌద్ధ ఇతిహాసాలు అశోకుడు చెడ్డ స్వభావం మరియు దుష్ట స్వభావం గలవాడని పేర్కొన్నాయి. ఎందుకంటే ఆయన “అశోకా హెల్ “ను నిర్మించాడు. తన రాజ్యంలో తన పాలనకి ఎదురు తిరిగిన వారిని శిక్షించటానికి ప్రత్యేకంగా ఓ హింసా గదిని నిర్మింప చేశాడు. ఆ గదిలో శిక్షలని అమలు చేసేవారు. అందుకే, కొన్ని పురాతన గ్రంథాలు అశోకుడు బౌద్ధమతంలోకి మారడానికి ముందు, ‘అత్యంత హింసాత్మక రాజు’ అని సూచిస్తున్నాయి. బౌద్ధమతంలోకి మారిన తర్వాత, ఆయన చేసే పుణ్యకార్యాల కారణంగా అశోకుడు ‘ధర్మాశోకుడు’గా ప్రసిద్ధి చెందాడు.
కళింగ యుద్ధం
అశోకుడు కళింగ వంటి అనేక చిన్న రాజ్యాలతో యుద్ధం చేసాడు. కళింగ యుద్దభూమిలో రక్తం ఏరులై పారింది. అది అతని హృదయాన్ని మార్చివేసింది. ఆపై అతను బౌద్ధులకు ఆదరణ ఇచ్చాడు. పన్నులు తగ్గించి శూద్రుల జీవితాన్ని మెరుగుపరిచాడు. ఖజానా ఖర్చుతో మంచి రాజు అయ్యాడు. ప్రజలు ఈ సమయంలో అతనిని బాగా ప్రేమించారు. అతని గత పాపాలను మరచిపోయారు. కొంతకాలానికి అశోకుడు రాజుగా తన పాత్రను నెమ్మదిగా మరచిపోయాడు. పూర్తిగా సన్యాసిగా మారాడు. ఇది సామ్రాజ్యానికి చాలా చెడ్డ విషయం. మనిషిగా చివరికి మంచివాడు కానీ రాజుగా మొదట్లో చాలా శాడిస్ట్ లా బెహేవ్ చేశాడు.
అశోకుని జీవితంలో ఇదో గొప్ప మలుపు అని చరిత్ర చెప్తుంది. కానీ, ఈ బుక్ లో టోటల్ డిఫెరెంట్ గా రాశారు. అశోకుడిలో వచ్చిన రిగ్రేట్ అనేది ఇక్కడ ప్రస్తావించబడిలేదు. పశ్చాత్తాపానికి సంబంధించిన సంకేతాలేవీ ఇప్పుడు ఒడిషాలో లేవు. ఒకప్పటి కళింగయే ప్రస్తుత ఒడిషా. అశోకుడు తాను బాధపెట్టిన వ్యక్తులకు క్షమాపణ చెప్పడానికి లేదా ఖైదీలను విడిపించడానికి కూడా ఇష్టపడలేదు. అతను విచారం వ్యక్తం చేసిన శాసనాలలో కూడా, అతను నిబంధనలను ఉల్లంఘిస్తే అటవీ గిరిజనుల మాదిరిగా ఇతర సమూహాలపై హింసకు పాల్పడతానని బెదిరించాడు.
మతపరమైన హింస
అనేక చారిత్రక ఆధారాల ప్రకారం, అశోకుని క్రూరత్వం మరియు అణచివేత పాలన కళింగ యుద్ధంతో ముగియలేదు. బౌద్ధ గ్రంథం అశోక చక్రవర్తి శాంతికాముకుడిగా మారిన సంవత్సరాల తర్వాత అతను చేసిన మారణహోమ చర్యల గురించి చెబుతుంది. ఇవి ముఖ్యంగా జైన మరియు అజీవిక శాఖల అనుచరులకు ఉద్దేశించబడ్డాయి. ఆసక్తికరంగా, ఇవి అతని తాత మరియు తండ్రి వారి జీవితకాలంలో అనుసరించిన శాఖలు.
బెంగాల్‌లో 18,000 మంది అజీవికలను అశోకుడు ఒకే ఎపిసోడ్‌లో ఎలా చంపేశాడో పాళీ గ్రంథం ‘అశోక వందన’ వివరించింది. పాటలీపుత్రలో, ఒక జైన భక్తుడు జైన తీర్థంకరుడికి సమర్పించిన బుద్ధుని చిత్రపటాన్ని చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు. అశోకుడు అతనిని, అతని కుటుంబాన్ని వారి ఇంట్లోకి లాక్కెళ్లి, నిర్మాణాన్ని తగులబెట్టమని ఆదేశించాడు. అప్పుడు అతను తలకొక బంగారు నాణేన్ని సమర్పించుకుంటాడు. ఇక అశోకుని బ్రతికున్న చివరి సోదరుడు టిస్సా… ప్రమాదవశాత్తూ చంపబడినప్పుడు మాత్రమే ఈ హత్యల పరంపర ముగిసింది.
అణచివేత పాలకుడు
అశోకుడు తన పాలనలో మతపరంగా ప్రేరేపించబడిన ప్రజాదరణ లేని అనేక శాసనాలను ఆమోదించినట్లు తెలుస్తుంది. అలాగే, అశోకుడు తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డలుగా భావించాడు. అందుకే, వారి క్షేమం కోసం కావలసినవన్నీ చేసినట్లు పేర్కొన్నారు.
వాస్తవం ఏమిటంటే, అశోకుడు జీవించి ఉన్నప్పుడే తిరుగుబాట్లు, ఆర్థిక పరిస్థితి కారణంగా మౌర్య సామ్రాజ్యం పతనమవటం ప్రారంభించింది. అశోకుని ఆధ్వర్యంలోనే తిరోగమన మరియు హింసాత్మక పాలన జరిగినట్లు తెలుస్తుంది. అందుకే అశోక చక్రవర్తి అంత గొప్పవాడు కాదు అంటారు.
అశోకుని మరణం
అశోకుడు సుమారు 36 సంవత్సరాలు పరిపాలించి క్రీ.పూ 232 లో మరణించాడు. దహన సమయంలో ఆయన శరీరం 7 పగళ్ళు – 7 రాత్రులు కాలిపోయిందని పురాణ కథనం. ఆయన మరణం తరువాత మౌర్య రాజవంశం కేవలం 50 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగింది. మొత్తంగా చూస్తే అశోకుని సామ్రాజ్యం దాదాపు భారత ఉపఖండం అంతటా విస్తరించి ఉంది.
చివరిమాట
పాలన ప్రారంభంలో, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనేక యుద్ధాలు చేసిన క్రూరమైన విజేత ఇతను. కళింగ యుద్ధం అనంతరం పశ్చాతాపంతో అహింస, కరుణ మరియు శాంతియుత జీవనాన్ని నొక్కిచెప్పే బౌద్ధ బోధకుడు ఇతను. అందుకే, హిస్టారికల్ రిఫరెన్సెస్ అన్నీ “అశోకా ఈజ్ గ్రేట్” అని తెలుపుతున్నాయి. కానీ, హింస, తిరుగుబాట్లు, అణచివేతలతో సాగిన అతని జీవితం… అధికారం చేజిక్కించుకోవటం కోసం చేసిన హత్యలు ఇవన్నీ అశోకుడ్ని క్రూరమైన రాజుగా వర్ణిస్తాయి. దీన్ని బట్టి చూస్తే, “అశోకా నాట్ సో గ్రేట్” అని చెప్పక తప్పట్లేదు.