సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి రోజు ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో యానిమల్ వీడియోలు అయితే నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా గున్న ఏనుగులకి సంబంధించి… అవి చేసే అల్లరి పనుల గురించి అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలని చూసిన నెటిజన్లు షేర్స్, కామెంట్స్ చేస్తూ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఓ గున్న ఏనుగు ‘హరే రామ హరే కృష్ణ’ సాంగ్ కి అదిరిపోయే లెవెల్లో డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అది రోడ్డుకి అడ్డంగా నిలుచుని వయ్యారాలు పోతూ డ్యాన్స్ చేస్తూంటే… పక్కనే ఉన్న మావటి తన చేతిలోని కర్రతో దానికి సిగ్నెల్స్ ఇస్తుంటాడు. అంతే… ఏదో అర్ధమయిపోయినట్లు తల ఊపుతూ… రోడ్డుకి ఒక పక్కగా వచ్చి… లయబద్దంగా కాళ్ళని కదుపుతూ… అచ్చం మనుషుల్లానే డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన ఎలాంటి వారైనా వావ్…! అనాల్సిందే! మరి మీరూ ఓ లుక్కేయండి.