టీమిండియా మాజీ రధసారథి ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అయినా… క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పలు రకాల యాడ్స్‌లో కనిపిస్తూ… ఫ్యాన్స్‌కి మరింత చేరువలో ఉన్నారు. ఇక తాజాగా ’అన్‌అకాడమీ’ యాడ్‌లో నటించి మెప్పించారు.
బెంగళూరుకి చెందిన ఆన్‌లైన్ ఎడ్యూకేషనల్ కంపనీ అన్‌అకాడమీ. ఈ సంస్థ ‘లెస్సన్ 7’ పేరుతో ఓ యాడ్ రూపొందించింది. అయితే, ధోనీ ఈ కంపనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీంతో జనవరి 24, సోమవారం International Day of Education సందర్భంగా సోషల్ మీడియాలో ఈ యాడ్‌ని విడుదల చేసింది.
ఇందులో ధోనీ రైల్వే ట్రాక్ పై పరిగెత్తుతూ ఉండగా… ట్రైన్ అతనిని తరుముకుంటూ వస్తుంది. అయితే, ట్రైన్ వేగం కంటే రెట్టింపు వేగంతో పరిగెడుతూ… తనకి ఎదురయ్యే అడ్డంకుల్ని చీల్చుకుంటూ వెళతాడు. ఈ క్రమంలో, ట్రైన్ కంటే తానే ముందుగా గమ్యాన్ని చేరతాడు.
ఇంతకీ ఈ యాడ్ కి అర్ధం ‘చూపు గమ్యం మీద మాత్రమే పెడితే… మద్యలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను అవలీలగా దాటేయెచ్చు. ఈ సంకల్పమే చివరికి నిన్ను విజేతగా నిలుపుతుంది అని.
చివర్లో విపత్కర సమయాల్లో ఈ ‘లెస్సన్ 7’ని గుర్తుంచుకోండి’ అనే క్యాఫ్షన్‌తో ఈ యాడ్ క్రియేట్ చేశారు.
Our most ambitious and Iconic Film till date. Took almost 1 year to make.
Lesson No. 7 https://t.co/b2TNY46UGD
— Gaurav Munjal (@gauravmunjal) January 24, 2022