ఓ యువకుడు నేనెవరో తెలుసా..! అంటూ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై రెచ్చిపోయాడు. ఇంతకీ కారణం ఏమిటో తెలుసా! బైక్‌పై వెళ్తున్న తనని ఆపినందుకు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు మన AP లోనే!
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని బస్ స్టాండ్ ఆవరణలో… బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడ్ని ఆపుతారు పోలీసులు. దీంతో కోపంతో రెచ్చిపోయిన ఆ యువకుడు నన్నే ఆపుతావా… నేనెవరో తెలుసా..! అంటూ వీరంగం సృష్టించాడు. అంతేకాదు, విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ని కాలర్ పట్టుకుని అతనిపై దాడికి దిగుతాడు. పక్కనే ఉన్న మిగతా పోలీసులు వద్దని ఎంత వారించినా లెక్క చేయకుండా అతనిని దుర్భాషలాడుతూ… అతనిపై పిడిగుద్దులు కురిపించాడు.
యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసిందే కాక, పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు అతను. దీంతో ఈ ఇష్యూని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అంతేకాదు, ఈ ఇన్సిడెంట్ ని పై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు కూడా ప్రారంభించారు.